అన్వేషించండి

Health Benefits of Kiwi: డెంగ్యూకే కాదు, గుండె జబ్బులకు కూడా చెక్ పెట్టే పండు... కివీ

కివీ పండ్లు ఒకప్పుడు దొరకడం కష్టమయ్యేది కానీ, ఇప్పుడు గ్రామాల్లో కూడా కనిపిస్తున్నాయి. వీటి వల్ల లాభాలు తెలిస్తే కోరికోరి కొనుక్కుని తింటారు.

కివీ పండ్లు అన్ని చోట్లా పండవు. కేవలం చల్లనిదేశాలైన న్యూజిలాండ్, చిలీ, గ్రీస్, అమెరికా, ఇటలీ లాంటిచోట్ల పండుతాయి. మనం అక్కడ్నించి దిగుమతి చేసుకుంటాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత, కానీ దాన్ని మనం కొంచెం మార్చుకుని కివీ చేసే మేలు ఉల్లి కూడా చేయదు అని చెప్పుకోవచ్చు. ప్రాణాంతక జబ్బుల నుంచి మనల్ని కాపాడే సూపర్ హీరో కివీ. రోజుకొకటి తింటే చాలు... ఆరోగ్యవంతుల జాబితా తయారుచేస్తే, అందులో మొదటి పేరు మీదే అవుతుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది పచ్చినిజం. 
Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?
Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
1. డెంగ్యూ బారిన పడిన వారికి కచ్చితంగా తినమని వైద్యులు చెప్పే పండు కివీ. ఈ పండు తినడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పడిపోకుండా ఉంటుంది. వాటి సంఖ్య కూడా పెరుగుతుంది. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే కివీలు ఎన్ని తింటే అంత మంచిది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటికి డెంగ్యూను ఎదుర్కొనే శక్తి వచ్చింది. 
2. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు రావు. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
3. మధుమేహం ఉన్నవారు కూడా ఏమాత్రం సందేహించకుండా కివీలను లాగించేయచ్చు. ఈ పండ్లు తింటే రక్తంలోని చక్కెరస్థాయులు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు రోజుకు కనీసం ఒక పండైనా తింటే మంచిది. 
4. వివిధ రకాల క్యాన్సర్లకు చెక్ పెట్ట సత్తా కూడా కివీలో పుష్కలంగా ఉంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంతో ఈ పండు ముందుంటుంది. 
5. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినే అలవాటున్నవారు విషజ్వరాల బారిన అంతసులువుగా పడరు. వారికి తట్టుకునే శక్తి ఉంటుంది. శరీరంలో ఇన్ ఫెక్షన్లు కూడా త్వరగా రావు. 
6. కివీలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. మెరుగైన కంటిచూపుకు ఇది చాలా అవసరం. 
7. నిద్ర‌లేమి సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం కివీ పండ్లు. వీటిని తింటే నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. 
8. కివీ పండ్లలో గుండెకు రక్షణ కల్పించే గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఇ, సి, పొటాషియం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. గుండెకు రక్తసరఫరా సజావుగా అయ్యేట్టు చూస్తాయి. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. కాబట్టి గుండెకు కివీ పండ్లు చాలా మంచివి. 
9. కివీ పండు తొక్కను చాలామంది తీసి పడేసి లోపలి గుజ్జునే తింటారు. కానీ తొక్కలో ఫ్లావనాయిడ్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి తొక్కతే తినేందుకు ప్రయత్నిస్తే మంచిది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget