News
News
X

HBD Trivikram: తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరయా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే... తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరు! ఎందుకు? తెలుసుకోండి మరి! Trivikram Srinivas

FOLLOW US: 
హీరోలకు అభిమానులు ఉంటారు. హీరోయిన్లకు ఉంటారు. నటులకు కూడా ఉంటారు. ఎందుకంటే? వాళ్లు తెరపై ప్రేక్షకులకు కనిపిస్తారు కాబట్టి! కొందరు దర్శకులకు కూడా అభిమానులు ఉంటారు. ఎందుకంటే? సినిమాలు తీస్తారు కాబట్టి. కానీ, త్రివిక్ర‌మ్‌కు ఉన్న అభిమానం వేరు! సినిమాను దాటి ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్లిన మనిషి ఆయన. అందుకే, తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరయా అనేది.
 
మాటల రచయితకు అభిమానులు ఉంటారా? కచ్చితంగా ఉంటారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ను చూస్తూ నిస్సందేహంగా ఆ మాట చెప్పవచ్చు. త్రివిక్రమ్ దర్శకుడు కాక ముందు నుంచి ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. త్రివిక్ర‌మ్‌కు ముందు చాలా మంది మాటల రచయితలు ఉన్నారు. గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే... త్రివిక్ర‌మ్‌కు ముందు, తర్వాత అనేలా ఆయన మాటలు రాశారు. పొదుపుగా, తక్కువ అక్షరాలతో లోతైన భావాలున్న మాటలు రాయడం త్రివిక్రమ్ ప్రత్యేకత. ప్రాసతో రాసినా పద్ధతిగా రాయడం త్రివిక్రమ్ శైలి. ఆయన్ను అనుసరించాలని, అనుకరించాలని చాలామంది ప్రయత్నించారు. అయితే... మాటలు రాయడంలో త్రివిక్రమ్ స్థాయిని అందుకున్నవాళ్లు లేరని చెప్పుకోవాలి. అందుకే, త్రివిక్రమ్ వేరయా అనేది.
 
రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు తెలుసు. ఆయన హీరోలను ఏ విధంగా చూపించినదీ తెలుసు. కానీ, త్రివిక్రమ్ సెట్ చేసిన ట్రెండ్ గురించి? టైటిల్స్ ట్రెండ్ గురించి? కథానాయికల క్యారెక్టరైజేషన్స్‌ గురించి? తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ. కథలు, కథలో పాత్రలు, ఆఖరికి సినిమా టైటిళ్లు కూడా!
 
టైటిల్స్ మాంత్రికుడు!
'నువ్వు నాకు నచ్చావ్' - రచయితగా త్రివిక్రమ్ పని చేసిన సినిమా టైటిల్. మరి, దర్శకుడిగా? 'అత్తారింటికి దారేది'! పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు అటువంటి టైటిల్ పెట్టే సాహసం ఆయన చేశారు. హీరో సపోర్ట్ ఉన్నప్పటికీ... ఆ విధమైన టైటిల్ పెట్టాలనే ఆలోచన దర్శకుడి రావాలి కదా! హీరో పేర్లను, హీరోయిజాన్ని పక్కనపెట్టి... కథకు తగ్గట్టు టైటిల్స్ పెట్టే ట్రెండ్ త్రివిక్రమ్ తీసుకొచ్చారు. 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల... వైకుంఠపురములో' ఆ కోవలో టైటిల్స్ అని చెప్పాలి. అలాగే, కథానాయిక పాత్రలకూ టైటిళ్లలో ప్రాముఖ్యం ఇచ్చారు. ఉదాహరణకు... 'అ... ఆ', 'అరవిందసమేత వీరరాఘవ'.
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
 
అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపారు!
కథానాయిక అంటే అందంగా ఉండాలి. అనాదిగా ఇండస్ట్రీలో వస్తున్న ట్రెండ్. ఈ విషయంలో త్రివిక్రమ్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపేలా హీరోయిన్ల పాత్రలు రాశారు. 'జులాయి'లో ఇలియానా పళ్లకు సెట్ పెట్టుకుని కనిపిస్తారు. 'ఇదేంటి అమ్మాయి పళ్లకు కంచె వేసుకుంది' అని బ్రహ్మానందం డైలాగ్ ఒకటి ఉంటుంది. 'జల్సా'లో ఇలియానాకు కళ్లజోడు పెట్టారు. అయినా హీరోలు ప్రేమలో పడతారు. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో సమంత షుగ‌ర్ లెవ‌ల్స్‌తో ఇబ్బంది పడే అమ్మాయిగా కనిపించారు. ఆరోగ్య సమస్యలు సాధారణం అనే సందేశం ఇచ్చారు. ప్రేమకు అవి అడ్డంకి కాదని సినిమాల్లో సన్నివేశాల ద్వారా చెప్పారు. మనసును చూసి ప్రేమిస్తారని, మనిషి అందాన్ని కాదని చెప్పారు. కుటుంబ విలువలు, అనుబంధాలకు త్రివిక్రమ్ తన సినిమాల్లో ఇంపార్టెన్స్ ఇస్తారు. సినిమాల్లో చెప్పడమే కాదు... నిజ జీవితంలోనూ త్రివిక్రమ్ పాటిస్తారని చెప్పాలి.
AlsoRead: దంచికొట్టు... కత్తిపట్టు... అదరగొట్టు... పవన్ పాట వింటే పూనకాలే!
 
అందరివాడు... స్నేహితుడు!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ స్నేహం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. దర్శకుడిగా బిజీగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ కోసం 'తీన్ మార్' సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. ఇప్పుడు 'భీమ్లా నాయక్'కు స్క్రీన్ ప్లే, మాటలతో పాటు ఓ పాట కూడా రాశారు. ఇదంతా ఆయన స్నేహం కోసమే చేశారు. 'జులాయి' నుంచి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నారు. ఆయనతో ఉన్న స్నేహం కారణంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాలకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. స్నేహితులు సునీల్ కోసమే ప్రత్యేకంగా పాత్రలు సృష్టించారు. అవే హాస్యనటుడిగా ఆయన్ను స్టార్ చేశాయి. త్రివిక్రమ్ సినిమాల్లో విలువలు ఉంటాయి. నిజ జీవితంలో? పై ఉదాహరణలు చాలుగా! ఒక్కసారి త్రివిక్రమ్‌తో ప్రయాణం మొదలైతే... ఎవరూ మధ్యలో వదల్లేరు. పవన్, చినబాబు, సునీల్ మాత్రమే కాదు... అల్లు అర్జున్, తమన్ ఇలా చెబుతూ వెళితే ఎంతోమంది. అందరికీ త్రివిక్రమ్ ఆప్తుడే. ఆయన సినిమాల్లో కొంతమంది ఆర్టిస్టులు రెగ్యుల‌ర్‌గా కనిపిస్తుంటారు. ఎందుకు? అంటే... త్రివిక్రమ్ స్నేహం!
 
గురూజీ... సినిమాలను దాటి!
సినిమాల్లో త్రివిక్రమ్ రాసే మాటలకు మాత్రమే కాదు... సినిమా వేడుకల్లో, ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పే మాటలకూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సిరివెన్నెల గురించి చెప్పిన మాటలు కావచ్చు, పవన్ గురించి వివరించే విధానం కావచ్చు, జీవితం గురించి చెప్పే విషయాలు కావచ్చు... అవే తెలుగు దర్శకుల అందు ఆయన్ను వేరుగా, ప్రత్యేకంగా నిలబెట్టాయి. గురూజీ అని అభిమానులు పిలుచుకునేలా చేశాయి. సోషల్ మీడియాలో ఆయన మాటలు ఫొటో కార్డుల్లా తిరుగుతున్నాయి. ఆయన మాటల వీడియోలకు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి.

 
Published at : 07 Nov 2021 03:35 PM (IST) Tags: Trivikram Trivikram Srinivas Matala Mantrikudu  త్రివిక్రమ్ శ్రీనివాస్

సంబంధిత కథనాలు

Gruhalakshmi October 4th Update: ఊహించని ట్విస్ట్, తులసి మీద కావాలని నింద పడేలా చేసిన సామ్రాట్- హనీ పుట్టినరోజు వేడుకల్లో తులసికి అవమానం

Gruhalakshmi October 4th Update: ఊహించని ట్విస్ట్, తులసి మీద కావాలని నింద పడేలా చేసిన సామ్రాట్- హనీ పుట్టినరోజు వేడుకల్లో తులసికి అవమానం

Karthika Deepam October 4th Update: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క

Karthika Deepam October 4th Update: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క

Devatha October 4th Update: సత్యకి తెలియకుండా రుక్మిణి వెంట ఆదిత్య- మాధవ్ చేతికి చిక్కిన పవర్ ఫుల్ అస్త్రం

Devatha October 4th Update: సత్యకి తెలియకుండా రుక్మిణి వెంట ఆదిత్య- మాధవ్ చేతికి చిక్కిన పవర్ ఫుల్ అస్త్రం

Ennenno Janmalabandham October 4th: ఆదిత్య కోరిక- వేద గుండె ముక్కలు, సులోచనకి యాక్సిడెంట్ చేయించిన మాళవిక

Ennenno Janmalabandham October 4th: ఆదిత్య కోరిక- వేద గుండె ముక్కలు, సులోచనకి యాక్సిడెంట్ చేయించిన మాళవిక

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?

టాప్ స్టోరీస్

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్

Godfather First Review : 'గాడ్ ఫాదర్' ఫ్లాప్ అంటుంటే హ్యాపీగా మెగా ఫ్యాన్స్