Thandel Box Office Collection Day 1: నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ - అదరగొట్టిన 'తండేల్', ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Thandel First Day Collections Worldwide:: నాగచైతన్య, సాయిపల్లవి 'తండేల్' మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు భారీగా కలెక్షన్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

Naga Chaitanya's Thandel Movie First Day Collections: యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా రూ.21.27 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ 'గీతా ఆర్ట్స్' (Geetha Arts) అధికారికంగా ట్వీట్ చేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. గతంలో చైతూ, పల్లవి కాంబోలో వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమా తొలి రోజు రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును తండేల్ దాటేసింది.
#BlockbusterThandel collects 𝟐𝟏.𝟐𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 on Day 1 with terrific response and word of mouth all over 💥💥💥
— Geetha Arts (@GeethaArts) February 8, 2025
A super strong Day 2 on cards ❤️🔥
Book your tickets for DHULLAKOTTESE BLOCKBUSTER #Thandel now!
🎟️ https://t.co/xtodRI8wA2… pic.twitter.com/RCmu73acn5
Also Read: 'ఖలేజా, కొమరం పులి మా డబ్బులతో తీశాడు' - అడిగితే రౌడీలతో బెదిరించాడు, శింగనమలపై ఫైనాన్షియర్ ఫైర్
అటు, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా తొలి రోజు 'తండేల్' (Thandel First Day Collections) భారీ కలెక్షన్లు రాబట్టింది. విదేశాల్లో మొదటి రోజు ఈ చిత్రం 3.50 లక్షల డాలర్లకు (రూ.3.7 కోట్లు) పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ 'గీతా ఆర్ట్స్' ఓ పోస్టర్ రిలీజ్ చేసి.. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ క్రమంలో త్వరలోనే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు, బుక్ మై షోలో 24 గంటల్లోనే సుమారు 2 లక్షలకు పైగా 'తండేల్' టికెట్స్ అమ్ముడయ్యాయని సంస్థ తెలిపింది. ట్రెండింగ్ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ప్రతి గంటకు 10 వేల టికెట్లు అమ్ముడుపోతున్నట్లు వెల్లడించింది.
#Thandel hits the $400K mark at the USA box office🔥🇺🇸
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 8, 2025
The blockbuster journey is just heating up🤩#BlockbusterThandel@chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts @TheBunnyVas @ThandelTheMovie pic.twitter.com/R9oi16xwZm
చైతూ, పల్లవి నటనకు ఫిదా
కాగా, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే సినిమా పాటలు, డైలాగ్స్‌తో భారీ అంచనాలు నెలకొన్నాయి. తండేల్ రాజుగా నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.
'తండేల్' కథేంటంటే..
శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుల జీవితాల్లో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన రాజు సహా మత్స్యకారులు పాక్ జలాల్లోకి వెళ్లగా.. అక్కడి అధికారులు జైల్లో వేస్తారు. అప్పుడు రాజు కోసం సత్యం ఏం చేసిందనేదే కథ. స్వగ్రామం నుంచి పాక్ సరిహద్దుల వరకూ వెళ్లిన సత్య.. రాజును, ఇతర మత్స్యకారులను విడిపించిందా.? లేదా..? అనేదే కథ. హృద్యమైన ప్రేమ కథకు భావోద్వేగాలు, దేశభక్తిని జోడించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.
Also Read: నన్నొక క్రిమినల్‌లా ట్రీట్ చేశారు... సమంతతో విడాకులపై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

