Pelli Kani Prasad Movie Trailer: 'నాన్నోయ్.. ఎక్స్ పీరియన్సే కాదు ఎక్స్‌పైరీ డేట్ కూడా దగ్గర పడింది' - నవ్వులు పూయిస్తోన్న సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్
Sapthagiri Movie: కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పెళ్లి కాని ప్రసాద్'. ఈ నెల 21న మూవీ రిలీజ్ కానుండగా.. తాజాగా హీరో వెంకటేష్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

Hero Sapthagiri's Pelli Kani Prasad Movie Trailer Released: కమెడియన్ సప్తగిరి (Sapthagiri), ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పెళ్లి కాని ప్రసాద్' (Pelli Kani Prasad). అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‍ను సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన టీజర్ నవ్వులు పూయిస్తుండగా మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ట్రైలర్ సైతం నవ్వులు పూయిస్తూ హైప్ పెంచేసింది. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'నాన్నోయ్.. ఎక్స్ పైరీ డేట్ కూడా దగ్గర పడుతుంది'
సప్తగిరి తన కామెడీ టైమింగ్‌తో మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. విదేశాల్లో సెటిలైన ఓ యువకుడు ఏజ్ బార్ కావడంతో తన పెళ్లి కోసం పడే పాట్లనే కథాంశంగా ఈ మూవీ రూపొందించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'నీకు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పెరుగుతోంది కదా.. దాన్ని చూపించి ఎక్కువ కట్నం డిమాండ్ చెయ్యొచ్చనే' తండ్రి అనగా.. 'వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఎక్స్ పైరీ డేట్ కూడా పెరుగుతుంది నాన్నా..' అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
తన ముత్తాతలు, తండ్రి కట్నం విషయంలో పెట్టే కండీషన్స్.. శాసనాల గ్రంథంలో పెట్టే రూల్స్ ఆసక్తికరంగా ఉండగా.. మరోసారి నవ్వులతో సప్తగిరి అలరించనున్నారు. అసలు ఆ కండీషన్స్ ఏంటో..?, ఫ్యామిలీతో సహా విదేశాల్లో స్థిరపడాలనే హీరోయిన్‌కు హీరోతో ఎలా జత కుదిరింది.? కట్నం శాసనాల గ్రంథం.. ఇన్ని రూల్స్ మధ్య అసలు పెళ్లి కాని ప్రసాద్‌కు పెళ్లైందా..? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, అన్నపూర్ణ, ప్రమోదిని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు.
#PelliKaniPrasad is ready to carry the family legacy forward!❤️🔥
— Sapthagiri (@MeSapthagiri) March 13, 2025
The hilarious theatrical trailer Out Now! 😆
▶️ https://t.co/CdCvtJoZvz
Get ready to witness this fun-filled family entertainer in theaters on March 21st💥
Theatrical Release by @SVC_official @MeSapthagiri… pic.twitter.com/QzMPerjgch
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీ టైమింగ్, పంచులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సప్తగిరి. ఆ తర్వాత 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' మూవీతో హీరోగా మారారు. సప్తగిరి ఎల్ఎల్‌బీ, వజ్రకవచధర గోవింద, గూడుపుఠాణి వంటి సినిమాలతో ఎంటర్‌టైన్ చేశారు. చాలా కాలం తర్వాత 'పెళ్లి కాని ప్రసాద్'తో కమర్షియల్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. టీజర్‌ను ప్రభాస్ రిలీజ్ చేయగా.. ట్రైలర్‌ను సీనియర్ హీరో వెంకటేష్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. వేరియేషన్స్ చూపించే పాత్రలు పడినప్పుడు కొన్ని ప్రయోగాలు చేయక తప్పదని.. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే ఆడియన్స్‌కు బోర్ అనిపించకుండా ఉంటుందని అన్నారు.





















