అన్వేషించండి

Nagam Meets Chandrababu: గుర్తుకొచ్చాయి-చంద్రబాబును కలిసిన నాగం-పాత విషయాలు గుర్తు చేసుకున్న స్నేహితులు

Nagam: విజయవాడలో చంద్రబాబును నాగం జనార్ధన్ రెడ్డి కలిశారు. పాత విషయాలను మాట్లాడుకున్నారు.

Nagam Janardhan Reddy met Chandrababu: తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తరువాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారూ...ఎలా ఉన్నారు....ఆరోగ్యం ఎలా ఉంది...చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు...ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. నాగం వయసు, బరువు కారణంగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే చంద్రబాబు ఆరోగ్య పరంగా ఎక్కువ బాధ్యతలు చెప్పారు.              

పాత కేసుల విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన నాగం                  
 
ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్థన్ రెడ్డి గురువారం హాజరయ్యారు.  తుది తీర్పు ప్రకటన సందర్భంగా నాగం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబును కలిశారు. ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు.               

కేసులు కొట్టి వేస్తూ కోర్టు తీర్పు - తర్వాత చంద్రబాబును కలిసేందుకు అసెంబ్లీకి వచ్చిన నాగం 

భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారని....పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవాళ్లని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎంతో ఎమోషనల్‌‌గా ఉండేవారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు. నాలుగవ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి...తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.          

పాత విషయాలను గుర్తు చేసుకున్న ఇరువురు నేతలు - ఆరోగ్యంపై జాగ్రత్త చెప్పిన చంద్రబాబు

ఉమ్మడి రాష్ట్రంలో  టీడీపీలో నాగం జనార్ధన్ రెడ్డి నెంబర్ 2 నాయకుడుగా ఉండేవారు. ప్రభుత్వం ఏర్పడితే మంత్రిగా ఉండేవారు. లేకపోతే ప్రతిపక్షంలో కీలక నేతగా ప్రభుత్వంపై పోరాడేవారు. అయితే ఇలాంటి నేతలందరికీ తెలంగాణ ఉద్యమం కారణంగా రాజకీయ  భవిష్యత్ తలకిందులు అయింది. టీడీపీపై ఆంధ్రా పార్టీ అనే ముద్ర పడటంతో  సీనియర్ నేతలు రాజకీయ భవిష్యత్ కోసం వేరే పార్టీలను చూసుకోక తప్పలేదు. నాగం సొంత పార్టీ పెట్టుకున్నారు.. బీజేపీలో చేరారు..కాంగ్రెస్ లో చేరారు.. అయినా మరోసారి ఆయన నాగర్ కర్నూలు నుంచి గెలవలేకపోయారు. దాంతో రాజకీయంగా ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయన ఆరోగ్యం కూడా ఇప్పుడు సహకరించకపోవడంతో  ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించడం లేదు. 

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget