అన్వేషించండి

Ilayaraja Vs Coolie: 'కూలీ'పై ఇళయరాజా గరమ్ గరమ్ - లీగల్ చిక్కుల్లో రజనీకాంత్ సినిమా

Rajinikanth's Coolie Legal Troubles: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కూలీ' సినిమాకు లీగల్ సమస్యలు వచ్చేట్టు ఉన్నాయి.

Ilayaraja is angry at the Coolie movie makers for using the song 'Vaa Vaa Pakkam Vaa' without his permission: కూలీ... సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా. ఆయన 171వ చిత్రమిది. సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటే తెలుగు, తమిళ భాషలతో పాటు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయనకు తోడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు యాడ్ కావడంతో మరింత క్రేజ్ నెలకొంది. ఇటీవల 'కూలీ' సినిమాను అనౌన్స్ చేయడంతో పాటు చిన్న టీజర్ విడుదల చేశారు. అది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే... అందులో ఓ పాట లీగల్ సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంది. 

పాటతో వచ్చిన సమస్య... ఇళయరాజా గరమ్ గరమ్!
'కూలీ' మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో చూశారా? అందులో అనిరుద్ రవిచందర్ అందించిన రీ రికార్డింగ్ సూపర్ ఉందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. రజనీ స్వాగ్ గుర్తు చేసేలా ఆయన పాత సినిమాలో సూపర్ హిట్ సాంగ్ 'వా వా పక్కమ్ వా'ను భలే యూజ్ చేశాడన్నారు.

ఇప్పుడు ఆ 'వా వా పక్కమ్ వా' పాట 'కూలీ'కి చిక్కులు తెచ్చి పెట్టింది. ఆ మూవీ టీజర్‌లో వినిపించిన మ్యూజిక్ అంతా అనిరుద్ సొంతంగా కంపోజ్ చేసిందే... ఆ ఒక్క సాంగ్ తప్ప! రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన, 1983లో విడుదల అయిన 'తగన్ మగన్' సినిమాలో సాంగ్ అది. మేస్ట్రో ఇళయరాజా ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్ కంపోజ్ చేసింది కూడా ఆయనే. 

తన అనుమతి లేకుండా తన పాటను 'కూలీ' దర్శక నిర్మాతలు వాడుకున్నారని ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాపీ రైట్స్ ఉల్లంఘన కింద 'కూలీ' నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures)కు ఇళయరాజా నోటీసులు పంపించారు. స్పందించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారట.

Also Readకల్కి నిర్మాతలతో శ్రీకాంత్ తనయుడు రోషన్ సినిమా - లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?


ఈ సమస్య నుంచి 'కూలీ' మేకర్స్ ఎలా బయట పడతారో చూడాలి. పాత సాంగ్స్ యూజ్ చేస్తే ఆయా సంగీత దర్శకులు, గేయ రచయితలకు రాయల్టీ ఇవ్వడం ఆనవాయితీ. ఇళయరాజాతో సమస్యను 'కూలీ' దర్శక నిర్మాతలు ఆ విధంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది.

'జైలర్' సక్సెస్ తర్వాత రజనీకాంత్ సినిమా
తమిళంతో పాటు తెలుగులోనూ భారీ సక్సెస్ సాధించిన 'జైలర్' తర్వాత రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా 'కూలీ'. LCU ఫ్రాంచైజీ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న లోకేష్ కనగరాజ్ చిన్న టీజర్ ద్వారా రజనీని స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో చూపించి సినిమాపై అంచనాలు పెంచారు. గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తుల డెన్ (గూడౌన్)లో అడుగు పెట్టిన హీరో.... బంగారు గడియారాలతో ఒక గొలుసు చేసి దాంతో అక్కడ ఉన్న రౌడీలను తుక్కు తుక్కుగా కొట్టిన విజువల్స్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Readఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
Embed widget