Jr NTR: ఎన్టీఆర్ కోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ - ఇయర్ ఎండ్ నుంచి అసలు కథ షురూ!
Jr NTR Prashanth Neel movie update: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'కెజియఫ్', 'సలార్' సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ మూవీ చేయనున్న సంగతి తెలుసు. దాని కోసం భారీ ప్లాన్ వేశారు.
మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న సినిమాల్లో 'కెజియఫ్', 'సలార్' సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చెయ్యబోయే మూవీ ఒకటి. సినిమా వుందని అనౌన్స్ మాత్రమే చేశారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? కథ ఎలా వుండబోతుంది? అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా వుంటుంది? వంటి వివరాలు చెప్పలేదు. కానీ 'కెజియఫ్'లో యశ్, 'సలార్'లో ప్రభాస్ క్యారెక్టర్లను డైరెక్టర్ మలచిన తీరు చూసి తమ అభిమాన హీరోకి అటువంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లు పడితే బావుంటుందని కోటి కలలతో వున్నారు. వాళ్లకు ఓ గుడ్ న్యూస్.
ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్!
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కెజియఫ్' గానీ, 'సలార్' గానీ చూడండి. అవుట్ డోర్ లొకేషన్స్ ఎక్కువ వుండవు. ఫిక్షనల్ సిటీల్లో కథ జరుగుతుంది. మెజారిటీ షూటింగ్ కూడా ఇండియాలో చేశారు. అయితే, ఎన్టీఆర్ సినిమా అలా వుండదట.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ చెయ్యబోయే సినిమా షూటింగ్ వివిధ దేశాల్లో చేసేలా కథ వుంటుందట. అందుకని ఇప్పటి నుంచి ప్లానింగ్ షురూ చేశారట. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నారట. షూట్ చేసేది విదేశాల్లో, ఇయర్ ఎండ్ నుంచి సినిమా స్టార్ట్ అంటే... ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ పెద్ద స్కెచ్ వేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
'వార్ 2' షూటింగులో తారక్ బిజీ!
ప్రజెంట్ ఎన్టీఆర్ ముంబైలో వున్నాడు. వైఫ్ ప్రణతీతో కలిసి వెళ్ళాడు. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి 'వార్ 2' సినిమా చేస్తున్నారు. ప్రజెంట్ ఆ షూటింగ్ చేస్తూ ముంబైలో బిజీ బిజీగా వున్నారు. గ్యాప్ దొరికినప్పుడు బాలీవుడ్ స్టార్లతో కలిసి రెస్టారెంట్లకు, పార్టీలకు కూడా వెళుతున్నాడు. 'వార్ 2' మూవీకి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్నాడు. రణబీర్ కపూర్, ఆలియా భట్ దంపతులకు అతడు క్లోజ్. ఇటీవల వీళ్లంతా కలిసి పార్టీ చేసుకున్నారు.
Also Read: బాహుబలి ఈజ్ బ్యాక్... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి, త్వరలో ట్రైలర్ రిలీజ్
అక్టోబర్ 10న 'దేవర'తో రానున్న ఎన్టీఆర్!
'వార్ 2' కంటే ముందు ఎన్టీఆర్ 'దేవర' పార్ట్ 1తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తనకు 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్లో ఆ సినిమా తెరకెక్కుతోంది. అందులో అతడికి జోడీగా నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు. ఆ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చెయ్యనున్నారు.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత ఎన్టీఆర్ నుంచి ఒక్క మూవీ కూడా రాలేదు. ఆయన సినిమా లేట్ అవుతోందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే, వాళ్ళందరూ కాలర్ ఎగరేసుకునేలా మూవీ వుంటుందని 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ చెప్పాడు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి.