అన్వేషించండి

Prabhas: ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో మాస్ సాంగ్ చేస్తే... స్క్రీన్లు చిరిగి పోవాలంతే!

ప్రభాస్ మాస్ సాంగ్ చేసి ఎన్ని రోజులు అయ్యింది? గుర్తు చేసుకోవడం కష్టమే కదా! ఆ కటౌట్‌కి తగ్గ ట్యూన్, స్టెప్స్ తో మాంచి మాస్ నంబర్ ఒకటి రెడీ అయ్యిందని టాక్.

Raja Saab Movie, Prabhas Songs Update: రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ పాటకు డ్యాన్స్ చేసి ఎన్ని రోజులు అయ్యింది? ఠక్కున గుర్తు రావడం కష్టమే! ఎందుకంటే... ఆల్మోస్ట్ పదేళ్లు దాటింది మరి. 'మిర్చి' సినిమాలో 'బార్బీ గాళ్...' పాటకు ప్రభాస్ మాంచి స్టెప్స్ వేశారు. ఆ తర్వాత 'బాహుబలి', 'సాహో', 'రాధే శ్యామ్', 'సలార్' సినిమాల్లో డ్యాన్స్ నంబర్స్ లేవు. ప్రభాస్ పెద్దగా స్టెప్స్ వేసింది లేదు. 

ప్రభాస్ మాస్ సాంగ్ చేస్తే, థియేటర్లలో స్క్రీన్లు చిరిగిపోయేలా మాస్ స్టెప్స్ వేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దర్శకుడు మారుతి చెవిలో ఆ కోరికలు పడినట్లు ఉన్నాయి. రెబల్ స్టార్ ర్యాంపేజ్ చూపించేలా మాస్ డ్యాన్స్ నంబర్ ఒకటి రెడీ చేయిస్తున్నారట.

'రాజా సాబ్'లో ముగ్గురు హీరోయిన్లతో మాస్ సాంగ్!
Raja Saab Prabhas Movie Cast: ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీస్తున్న సినిమా 'రాజా సాబ్'. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. 'ఇస్మార్ట్ శంకర్' ఫేమ్ నిధీ అగర్వాల్ ఒక హీరోయిన్ కాగా... మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ మరొక హీరోయిన్. 'రాధే శ్యామ్'లో కీలక పాత్ర చేసిన రిద్ధి కుమార్ ఇంకో హీరోయిన్.

నిధి, మాళవిక, రిద్ధి... ముగ్గురు హీరోయిన్లతో 'రాజా సాబ్' సినిమాలో ఒక పాటకు ప్రభాస్ డ్యాన్స్ చెయ్యనున్నారని సమాచారం. అభిమానులు ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ, థియేటర్లలో హంగామా చేసేలా ఆ సాంగ్ ఉండబోతుందని తెలిసింది. ప్రభాస్ కటౌట్ నుంచి ఆశించే మాస్ ట్యూన్ తమన్ రెడీ చేశారట.

Also Read: బాహుబలి ఈజ్ బ్యాక్... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి, త్వరలో ట్రైలర్ రిలీజ్


'రాజా సాబ్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇంకా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. సంక్రాంతి బరిలో రద్దీ చూసుకుని పాన్ ఇండియా స్థాయిలో పోటీ వంటివి చెక్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Also Readనందితా శ్వేతా సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయినట్టేనా? స్టార్ అవ్వాల్సిన హీరోయిన్‌కు ఎందుకీ దుస్థితి?


జూన్ 27న 'కల్కి'తో రానున్న ప్రభాస్!
'రాజా సాబ్' కంటే ముందు 'కల్కి 2989 ఏడీ'తో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఆ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీని జూన్ 27న రిలీజ్ చెయ్యనున్నారు. అందులో దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్లు. 2024లో 'సలార్'తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న ప్రభాస్, ఆ సినిమా సీక్వెల్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ నెలలో 'సలార్ 2' సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీస్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' స్టార్ట్ చేస్తారు. ఆ మూవీ మీద కూడా అంచనాలు భారీగా ఉన్నారు. 'యానిమల్' సక్సెస్ కూడా అందుకు ఒక రీజన్. ఇప్పుడు ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజిలో క్రేజ్ సొంతం చేసుకుంటోంది. 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget