Nabha Natesh: తెలుగులో మళ్లీ బిజీ అవుతున్న ఇస్మార్ట్ పోరి
తెలుగు ప్రేక్షకుల్లో ఇస్మార్ట్ పోరిగా గుర్తింపు పొందిన కన్నడ భామ నభా నటేష్. ఆమె తెలుగులో మళ్లీ బిజీ అవుతున్నారు. ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇస్మార్ట్ హీరోయిన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది నభా నటేష్ (Nabha Natesh). స్వతహాగా ఆమె కన్నడిగ కావచ్చు. కానీ, తెలుగు సినిమా వరకు హైదరాబాదీ. 'ఇస్మార్ట్ శంకర్' తెచ్చిన గుర్తింపు అటువంటిది. నితిన్ 'మేస్ట్రో' తర్వాత తెలుగు చిత్రసీమలో ఆమెకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బిజీ బిజీ అవుతున్నారు. ఒకటికి రెండు సినిమాలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
అటు ప్రియదర్శి... ఇటు నిఖిల్!
తెలుగు సినిమా సెట్స్, షూటింగ్ లొకేషన్లలో నభా నటేష్ అడుగుపెట్టి మూడేళ్లు అని చెప్పాలి. 2021 తర్వాత ఆమె నటించిన సినిమాలు ఏవీ విడుదల కాలేదు. ఈ మధ్య కాలంలో ఆమెకు యాక్సిడెంట్ కావడం సినిమాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై మళ్లీ దృష్టి సారించారు. నిఖిల్, ప్రియదర్శి సరసన సినిమాలు చేస్తున్నారు.
Nabha Natesh upcoming movies in Telugu: నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్న తొలి చారిత్రాత్మక చిత్రం 'స్వయంభు'. అందులో సంయుక్తా మీనన్ కథానాయిక. అయితే, ఆమెతో పాటు మరొక నాయికకు సైతం చోటు ఉందట. ఆ క్యారెక్టర్ నభా నటేష్ (Nabha Natesh In Nikhil Swayambhu) సొంతం అయ్యిందని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: జగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!
#swayambhu @actor_Nikhil సరసన @NabhaNatesh కూడా...
— devipriya (@sairaaj44) March 13, 2024
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి. ఆయన ప్రియదర్శి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. పూర్తిగా వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోనూ నభా నటేష్ హీరోయిన్. ఈ రెండు కాకుండా మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, త్వరలో వాటిని కూడా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇస్మార్ట్ స్థాయి విజయం కోసం!
'ఇస్మార్ట్ శంకర్' కంటే ముందు తెలుగులో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశారు నభా నటేష్. మరో కన్నడ సినిమాలో ప్రత్యేక గీతం చేశారు. అయితే, ఆమె కెరీర్ మొత్తంలో ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ హిట్. సుధీర్ బాబుకు జంటగా నటించిన 'నన్ను దోచుకుందువటే' మంచి విజయం సాధించింది. కానీ, 'అదుగో' ఫ్లాప్ అయ్యింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మాస్ మహారాజా రవితేజకు జోడీగా 'డిస్కో రాజా', సాయి ధరమ్ తేజ్ సరసన 'సోలో బ్రతుకే సో బెటర్' మోస్తరు విజయాలు సాధించాయి. 'అల్లుడు అదుర్స్', ఓటీటీలో విడుదలైన 'మేస్ట్రో'కి అంతగా పేరు రాలేదు. రీ ఎంట్రీలో 'ఇస్మార్ట్ శంకర్' స్థాయి విజయం అందుకోవాలని నభా నటేష్ కృషి చేస్తున్నారట.
Also Read: యాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?
#News నభానటేష్-ప్రియదర్శిలతో
— devipriya (@sairaaj44) March 11, 2024
హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి
నిర్మిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్
దాదాపు పూర్తవుతోంది.
దీని తరువాత మెగా మేనల్లుడితో సినిమా
ప్లాన్ చేస్తున్నారు.