బికినీలో బోల్డ్ ఫోటో షూట్ చేసిన ఈ అందాల భామ ఎవరో తెలుసా? ఈ హీరోయిన్ పేరు చైత్ర జె ఆచార్. కన్నడ భామ అయినప్పటికీ ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగుకు వచ్చారు. రక్షిత్ శెట్టి హీరోగా నటించడంతో పాటు నిర్మించిన 'సప్త సారాలు దాటి'లో చైత్ర నటించారు. 'సప్త సాగరాలు దాటి' సినిమాలో చైత్రది వేశ్య పాత్ర. 'సైడ్ బి'లో ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. 'సప్త సాగరాలు దాటి'కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. చైత్ర నటనకు సైతం గుర్తింపు లభించింది. 'సప్త సాగరాలు దాటి' మెయిన్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కు తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ, చైత్రకు రాలేదు. తెలుగు సినిమాల్లో నటించడానికి చైత్ర ఆసక్తిగా ఉన్నారట. తెలుగులో ఆమె తొలి సినిమా ఏది అవుతుందో చూడాలి. చైత్ర జె ఆచార్ బికినీ ఫోటో షూట్ (All Images Courtesy: chaithra.j.achar/ instagram)