ఫ్రెండ్ సంగీత్ పార్టీకి శారీ, బ్లౌజ్ డిజైన్స్ కోసం ఆప్షన్స్ చూస్తున్నారా? అయితే జాన్వీని ఫాలో అవ్వండి మరి! సంగీత్ పార్టీకి లెహంగా, మోడ్రన్ డ్రస్ లో వెళ్లడం కామన్! ట్రెండీ శారీలో వెళితే అందరి చూపులు మీమీదే. డీప్ నెక్ బ్లౌజ్, ఫ్లోరల్ ప్రింట్ శారీ కడితే... ట్రెడిషన్ ప్లస్ ట్రెండ్ మిక్స్ చేసినట్లు ఉంటుంది. సంగీత్ పార్టీకి మోనో కలర్ శారీ బెస్ట్ ఆప్షన్. బ్లౌజ్ & శారీ సేమ్ కలర్ అయితే సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు ఉంటుంది. మలయాళీ ఫ్రెండ్ సంగీత్ పార్టీ అయితే కేరళ స్టైల్ వైట్ శారీ అదిరిపోదూ! స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ వర్క్ శారీస్ కూడా సంగీత్ పార్టీల్లో ట్రెండీగా ఉంటాయి. బ్లౌజ్ కి మగ్గం వర్క్ వంటివి చేయించడంతో పాటు చీర అంచుకు వర్క్ చేయిస్తే మోడ్రన్ లుక్ రెడీ. ప్రతి అమ్మాయి వార్డ్ రోబ్‌లో తప్పకుండా ఉండాల్సింది బ్లాక్ శారీ. సంగీత్ సహా ఏ పార్టీకి అయినా సెట్ అవుతుంది. కంప్లీట్ ట్రెడిషనల్ శారీ కడితే... ఆ లుక్ వేరుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జాన్వీ కపూర్ (All Images Courtesy: janhvikapoor / Instagram)