జపాన్‌లో రష్మిక చేస్తున్న పని ఇదా? ‘యానిమల్’ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది రష్మిక. తనకు ఉన్న ‘నేషనల్ క్రష్’ ట్యాగ్‌కు న్యాయం చేసింది. ధనుష్‌తో ఒక తమిళ మూవీని కూడా చేస్తోంది రష్మిక. ప్రస్తుతం ఆమె అభిమానులంతా ‘పుష్ప - 2’ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రష్మిక జపాన్‌లో ఉంది. అక్కడ ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గోనుంది. ఈ సందర్భంగా ‘కొన్నిచివా టోక్యో’ అంటూ ఓ స్టైలిష్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. కొన్నిచివా అంటే జపనీస్ భాషలో హలో అని అర్థం. ప్రస్తుతం ‘పుష్ప - 2’ మూవీ షూటింగ్ కూడా జపాన్‌లో జరుగుతోంది. రష్మిక అందుకే జపాన్ వెళ్లి ఉండవచ్చని అభిమానులు అనుకుంటున్నారు. అంటే రెండు పనులు ఒకేసారి చక్కపెట్టేందుకే రష్మిక జపాన్ వెళ్లి ఉంటోందని భావిస్తున్నారు.