Image Source: Anjana Yelavarthy/Instagram

నాని కొడుకు టాలెంట్ అదుర్స్ - పియానో భలే వాయించాడు

ఈ మధ్య హీరో కొడుకులు భిన్నమైన టాలెంట్ చూపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా ఇప్పటికే మ్యూజిక్‌లో తన సత్తా చాటుతున్నాడు.

నాని కొడుకు అర్జున్ (జున్ను) కూడా అదే బాటలో నడుస్తున్నాడు.

ఇటీవల నాని పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు జున్ను.

ఈ సందర్భంగా తన క్యూట్ క్యూట్ మాటలతో మురిపించాడు.

‘‘నాకు ఇష్టమైన మా నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకే ఈ గిఫ్ట్’’ అని జున్ను చెప్పాడు.

ఆ తర్వాత పియానో ప్లే చేసి ఆశ్చర్యపరిచాడు. ‘గ్యాంగ్ లీడర్’లోని ‘‘హొయనా’’ సాంగ్ ప్లే చేశాడు.

Image Source: Anjana Yelavarthy/Instagram

తన కొడుకు టాలెంట్ చూసి.. నాని మురిసిపోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.