ABP ఇవెంట్‌లో మెరిసిన తమన్నా - విద్యా వ్యవస్థపై కామెంట్స్ ఇటీవల ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’లో తమన్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజల భవిష్యత్తు మెరుగుపడేందుకు అమూల్యమైన సూచనలు ఇచ్చారు. విద్యా వ్యవస్థకు సంబంధించి సలహాలు ఇచ్చారు తమన్నారు. మన విద్యావ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని, అప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు. ‘బాహుబలి’ సినిమా తన కెరీర్ మాత్రమే కాదని, యావత్ సినీ పరిశ్రమకే టర్నింగ్ పాయింటని అన్నారు. ఆ సినిమాలో తనకు అవంతిక పాత్ర ఎందుకు ఇచ్చారని రాజమౌళిని ప్రశ్నించానని తెలిపారు. అయితే, రాజమౌళి నవ్వారే గానీ.. సమాధానం మాత్రం చెప్పలేదన్నారు. తాజాగా తమన్నా.. ఏబీపీ నెట్‌వర్క్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మీట్ పిక్స్, వీడియోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. Images and Videos Credit: Tamannaah Bhatia/Instagram