అన్వేషించండి

Shanmukh Jaswanth: యాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రముఖ యూట్యూబర్, 'బిగ్ బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్‌లు, పబ్లిక్ అప్పియరెన్స్ కంటే కేసులు, గొడవలు వార్తల్లో ఎక్కువ నిలిచాయి. వివాదాస్పద యూట్యూబర్ కింద ముద్ర పడిన షణ్ముఖ్ మంగళవారం యాదాద్రి ఆలయానికి వెళ్లారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వివాదాల నుంచి బయట పడటం కోసమేనా?
షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth Controversies)ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆయన సోదరుడిపై విశాఖకు చెందిన ఓ మహిళ కేసు పెట్టారు. తనను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరై, నిశ్చితార్థం చేసుకున్న తర్వాత మరొక మహిళ మెడలో మూడు ముడులు వేశారని ఫిర్యాదులో పేర్కొంది. అతని కోసం వెళ్లిన పోలీసులకు గంజాయి తాగుతూ షణ్ముఖ్ జస్వంత్ కనిపించడంతో అరెస్ట్ చేశారు.

షణ్ముఖ్ కేసును ప్రముఖ లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర టేకప్ చేయడం, బెయిల్ మీద అతడిని బయటకు తీసుకు రావడం వంటివి తెలిసిన విషయాలే. గత ఏడాది కార్ యాక్సిడెంట్ కేసులోనూ షణ్ముఖ్ అరెస్ట్ అయ్యారు. మద్యం మత్తులో మూడు వాహనాలను ఢీ కొట్టిన ఘటనలో ఆయన మీద తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. 

షణ్ముఖ్ జస్వంత్ వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో నటుడిగా అతని ప్రతిభ కంటే వ్యక్తిగత వ్యవహార శైలి వార్తల్లో నిలుస్తోంది. బ్యాడ్ లక్ అతడిని వెంటాడుతోందని ఫ్యాన్స్ వాపోతున్నారు. 'పాపం... షణ్ముఖ్' అంటూ అతడి మీద జాలి చూపిస్తున్న జనాలు సైతం ఉన్నారు. వివాదాలు, బ్యాడ్ లక్ నుంచి బయట పడటం కోసం షణ్ముఖ్ లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు చేసి ఉండొచ్చు. భక్తులకు ఉన్న శాపాలు తొలగించి వాళ్లను విముక్తులను చేస్తారని లక్ష్మీ నరసింహ స్వామిని కొలుస్తారు. భక్తుల మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తిగా ఆయన గురించి పురాణాల్లో ఉంది.

హీరోయిన్లుగా షణ్ముఖ్ జస్వంత్‌ సిరీస్‌లలో నటించిన అమ్మాయిలు
షణ్ముఖ్ జస్వంత్ సరసన యూట్యూబ్ సిరీస్ చేసిన అమ్మాయిలు వెండితెరపై మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లో కానిస్టేబుల్ పాత్రలో నటించిన మౌనికా రెడ్డి గుర్తున్నారా? ఆమె షణ్ముఖ్ 'సూర్య' సిరీస్‌లో నటించారు. ఇక, 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 'సాఫ్ట్‌వేర్ డేవ్ లవ్ పర్' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి వెండితెరపై క్రేజీ కథానాయిక. ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

Also Read: ప్రియదర్శి ఈర్ష్య పడేలా చైతన్య రావ్ - చిరంజీవి పేరు పెట్టుకోవడంతో హీరోలో భయం, భక్తి!

షణ్ముఖ్ స్నేహితుడు, 'వైవా' హర్ష సైతం 'సుందరం మాస్టర్'తో హీరో అయ్యారు. మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలో షణ్ముఖ్ సైతం సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Readలుంగీ కట్టి, గళ్ళ చొక్కా వేసి... హీరోగా రావు రమేష్ ఫస్ట్ లుక్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిక్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget