Rao Ramesh: లుంగీ కట్టి, గళ్ళ చొక్కా వేసి... హీరోగా రావు రమేష్ ఫస్ట్ లుక్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిక్స్!
Maruthi Nagar Subramanyam First Look: రావు రమేష్ హీరోగా రూపొందుతున్న 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ విడుదలైంది.
Rao Ramesh As Hero: రావు రమేష్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుడు. 'కొత్త బంగారు లోకం' నుంచి మొదలు పెడితే... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అ ఆ', 'కెజియఫ్' - ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన హీరోగా మారారు. వయసుకు తగ్గ కథ, క్యారెక్టర్ కుదరడంతో కథానాయకుడిగా సినిమా చేశారు.
'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో హీరోగా...
Maruthi Nagar Subramanyam movie cast and crew: రావు రమేష్ హీరోగా, టైటిల్ రోల్ పోషించిన సినిమా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ఈ రోజు సినిమాలో రావు రమేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ రిలీజ్ స్పెషాలిటీ ఏమిటంటే... ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా విడుదల చేయడం! రావు రమేష్ మంగళవారం ఉదయం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. 50 వేల మందికి పైగా స్కాన్ చేశారని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రావు రమేష్ ఫస్ట్ లుక్ చూస్తే... గళ్ళ చొక్కా, లుంగీలో పక్కా మాసీగా కనిపిస్తున్నారు. ఈసారి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తానని రావు రమేష్ తెలిపారు.
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రావు రమేష్ ఎంటర్‌టైన్ చేస్తారు. ఆయన డిఫరెంట్ రోల్ చేశారు. సినిమాలో వినోదంతో పాటు భావోద్వేగాలు సైతం ఉన్నాయి. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. కుటుంబం అంతా కలిసి చూసేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా తెరకెక్కించాం'' అన్నారు. ''ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చూపించిన అభిమానానికి సదా కృతజ్ఞుడిని'' అని రావు రమేష్ చెప్పారు.
Also Read: వేణు స్వామిని కలిసిన అనన్య - క్షుద్రపూజల కథతో తీసిన 'తంత్ర' కోసం!
రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ - భాస్కరభట్ల రవి కుమార్ - కళ్యాణ్ చక్రవర్తి, కళా దర్శకత్వం: సురేష్ భీమంగని, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, ఛాయాగ్రహణం: ఎంఎన్ బాల్ రెడ్డి, సహ నిర్మాతలు: రుషి మర్ల - శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల - మోహన్ కార్య, కథ - కథనం - మాటలు - దర్శకత్వం: మోహన్ కార్య.