Mangalavaram : స్వాతి కోసం బెంగళూరు కాలేజీకి వెళ్ళిన బన్నీ - అప్పుడు ఏం జరిగిందంటే?
Swathi Reddy Gunupati : 'మంగళవారం'తో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బన్నీ అతిథిగా వచ్చారు. తనతో పరిచయం గురించి స్వాతి...
Mangalavaram producer Swathi Reddy Gunupati Interview : వినోద పరిశ్రమ నిమ్మగడ్డ ప్రసాద్ ఫ్యామిలీకి కొత్త కాదు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'మా టీవీ'ని కొన్నేళ్ళ పాటు విజయవంతంగా నడిపిన చరిత్ర ఉంది. ఇప్పుడు ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి చిత్ర నిర్మాతగా పరిచయం అవుతున్నారు.
ముద్ర మీడియా వర్క్స్ సంస్థ స్థాపించిన స్వాతి రెడ్డి గునుపాటి... ఎం. సురేష్ వర్మ, దర్శకుడు అజయ్ భూపతికి చెందిన 'ఎ' క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ఈ నెల 17న థియేటర్లలోకి వస్తున్న 'మంగళవారం' చిత్రాన్ని నిర్మించారు. మొన్న జరిగిన 'మంగళవారం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ (Mangalavaram pre release event)కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. స్వాతి గురించి గొప్పగా మాట్లాడారు. అసలు... అల్లు అర్జున్ & స్వాతి రెడ్డి గునుపాటి మధ్య స్నేహం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నకు తాజా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే?
నేను కాలేజీలో ఉన్నప్పుడు బన్నీ వచ్చారు! - స్వాతి
'బన్నీతో మీ స్నేహం ఎప్పుడు మొదలైంది?' అని స్వాతి రెడ్డి గునుపాటిని తాజా ఇంటర్వ్యూలో అడిగితే ''మా స్నేహం చాలా ఏళ్ళ క్రితమే మొదలైంది. మా టీవీ కంటే ముందు నుంచి మేం స్నేహితులం. మా కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ఓ సరదా సంఘటన చెప్పాలి... నేను కాలేజీలో ఉన్నప్పుడు 'ఓ ఈవెంట్‌కు అల్లు అర్జున్ (Allu Arjun)ను ముఖ్య అతిథిగా తీసుకు రావాలి' అని మా హెచ్ఓడి కండిషన్ పెట్టారు. లేదంటే హాల్ టికెట్ ఇవ్వనని అన్నట్లు చెప్పారు. నాకు ఏం చేయాలో తెలియలేదు... నాన్న (నిమ్మగడ్డ ప్రసాద్)ను రిక్వెస్ట్ చేశా. అరవింద్ అంకుల్ గారిని అడగమని చెప్పా. అప్పుడు మా కాలేజీకి (ఫెస్ట్ కోసం) బన్నీ వచ్చారు. ఆ తర్వాత మేం మరింత దగ్గర అయ్యాం. నిజం చెప్పాలంటే... అల్లు అర్జున్ భార్య స్నేహ, నేను క్లోజ్ ఫ్రెండ్స్. మా ఆయన ప్రణవ్, స్నేహ స్కూల్ మేట్స్. అలా మరింత దగ్గర అయ్యాం'' అని చెప్పారు.
Also Read : సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ మధ్య పోటీనా? మాజీ భార్య భర్తల మధ్య పోటీనా?
బన్నీ ఓకే అన్నాక మరింత కాన్ఫిడెన్స్!
'మంగళవారం' సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు అల్లు అర్జున్ కథ విన్నారు. ఆ తర్వాత తనకు కథపై మరింత కాన్ఫిడెన్స్ వచ్చిందని స్వాతి రెడ్డి తెలిపారు. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ''బన్నీకి అజయ్ భూపతి కథ చెప్పడానికి వెళ్లిన రోజు నేను లేను. కథ విని బన్నీ బావుందన్నాడు. అప్పటికి నేను సినిమా చేయాలని 80 శాతం చేయాలని ఫిక్స్ అయ్యాను. అజయ్ దర్శకత్వ శైలి మీద బన్నీకి నమ్మకం ఉంది'' అని ఆమె చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది.
Also Read : చేత బడులు, క్షుద్ర పూజలపై ఫోకస్ పెట్టిన టాలీవుడ్.. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా?