విడాకులు తీసుకోవడం, ఆ సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో 2 ఏళ్ళు నరకం చూశానని సామ్ అన్నారు. మయోసిటిస్ చికిత్స తీసుకుంటూ 'యశోద', 'శాకుంతలం', 'ఖుషి' షూటింగ్స్ చేశారు సమంత. సినిమాలతో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం నటనకు కొంత విరామం ఇచ్చారు. హైపర్స్ బజార్ మ్యాగజైన్ కోసం సమంత స్విమ్ సూట్, స్టైలిష్ డ్రస్ లలో ఫోటోషూట్ చేశారు. విడాకులు, వ్యాధి... ఎవరూ చూడని పాతాళానికి తాను పడి లేచానని సమంత చెబుతున్నారు. వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల సినిమాలపై కూడా ఎఫెక్ట్ పడిందని సామ్ తెలిపారు. విడాకుల గురించి గతంలో సమంత మాట్లాడినప్పటికీ... కిందకు పడ్డానని ఆమె మాట్లాడటం ఇది తొలిసారి. సమంత (all images courtesy : samantharuthprabhuoffl / instagram)