సత్యం రాజేష్ కి బాడీగార్డ్ గా మారిన వెన్నెల కిషోర్ - వీడియో చూస్తే నవ్వుతూనే ఉంటారు! కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. 'వెన్నెల' సినిమాతో ఇండ్రస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. బ్రహ్మానందం, అలీ, సునీల్ తర్వాత కమెడియన్ గా మళ్ళీ ఆ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. కమెడియన్ గానే కాకుండా దర్శకుడిగా మారి 'జఫ్ఫా' అనే సినిమాని తెరకెక్కించాడు ప్రస్తుతం 'చారి 111' అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. పొలిమేర 2తో హిట్ కొట్టిన సత్యం రాజేష్‌ను వెన్నెల కిశోర్ ఇలా ఆటపట్టించాడు. Photo Credit : Vennela Kishore/Instagram