KRR Love Letter: తెలుగు సినిమాకు రాఘవేంద్రరావు ప్రేమలేఖ - చదవడానికి మహేష్ వెయిటింగ్
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఒక పుస్తకం రాశారు. త్వరలో అది విడుదల కానుంది. ఆ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నట్టు మహేష్ బాబు చెప్పారు.
కోవెలమూడి రాఘవేంద్రరావు... దర్శకేంద్రుడు అని కొందరు అంటారు. క్లుప్తంగా KRR అని కొందరు అంటారు. ఎవరు ఎలా పిలిచినా... మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దిగ్గజ దర్శకుల్లో ఒకరు. తెలుగు సినిమా కమర్షియల్ లెక్కలు మార్చిన దర్శకుల్లో ముందు వరుసలో ఆయన తప్పకుండా ఉంటారు. ఇప్పుడు ఆయన ఒక పుస్తకం రాశారు.
A Love Letter To Cinema By KRR - ఇదీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రాసిన పుస్తకం పేరు. ఈ పేరును సూపర్ స్టార్ మహేష్ బాబు రివీల్ చేశారు. దాంతో కె. రాఘవేంద్ర రావు పుస్తకం రాసిన విషయం ప్రేక్షక లోకానికి తెలిసింది. ''ఏ లవ్ లెటర్ టు సినిమా బై కెఆర్ఆర్... వావ్! అది చదవడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ బుక్ లాంచ్ మావయ్య'' అని మహేష్ బాబు ఒక వీడియో విడుదల చేశారు. మే 13న 'ఏ లవ్ లెటర్ టు సినిమా బై కెఆర్ఆర్' పుస్తకం విడుదల కానుంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువ, 2022 ఇండియన్ బాక్సాఫీస్‌లో టాప్ ప్లేస్ 'కెజియఫ్ 2'దే
Wishing @Ragavendraraoba garu all the best for the launch of his memoir #KRRLoveLetter on May 13th! pic.twitter.com/FsRU3ZNPOh
— Mahesh Babu (@urstrulyMahesh) May 11, 2022
రాఘవేంద్ర రావు శిష్యులు పలువురు పరిశ్రమలో ఉన్నారు. వారిలో తెలుగు పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలు దిశలా చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. దర్శకేంద్రుడు వందకు పైగా సినిమాలు తీశారు. అందులో హిందీ సినిమాలూ ఉన్నాయి. అయితే, తెలుగు సినిమాలు ఎక్కువ. పాటలు తీయడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఇప్పుడీ పుస్తకంలో సినిమా మేకింగ్, తదితర విషయాల గురించి ఆయన తన అనుభవాలు, పాఠాలు చెబుతారేమో!?
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోనులో మాట్లాడిన మహేష్
View this post on Instagram