By: ABP Desam | Updated at : 11 May 2022 02:24 PM (IST)
'కెజియఫ్ 2'లో యశ్
KGF 2 Box Office Collection: హిస్టరీ... ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో 'కెజియఫ్ 2' సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెయ్యి కాదు... 1100 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసింది. అంతే కాదు... రూ. 1200 కోట్లకు చేరువలో ఉంది.
ఈ ఏడాది (2022)లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'కెజియఫ్ 2' సరికొత్త చరిత్ర లిఖించింది. హిందీలో ఈ ఏడాది హయ్యస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్, ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్, ఫస్ట్ వీక్ రికార్డులు ఈ సినిమా పేరు మీద ఉన్నాయి. అంతే కాదు... రూ. 250 కోట్లు కలెక్షన్స్ మార్క్ చేరుకున్న సినిమాగా కూడా 'కెజియఫ్ 2' రికార్డ్ క్రియేట్ చేసింది.
'ఆర్ఆర్ఆర్'కు హిందీలో రూ. 270 కోట్లు వసూళ్లు రాగా... 'కెజియఫ్ 2'కు 412.8 కోట్లు వచ్చారు. ఇంకా సినిమా ఆడుతోంది. దీని కంటే ముందు 'బాహుబలి 2' మాత్రమే ఉంది. రూ. 510.99 కోట్ల వసూళ్లతో ప్రభాస్ సినిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దానిని బీట్ చేస్తుందో? లేదో? గానీ... ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో 'ఆర్ఆర్ఆర్'ను 'కెజియఫ్ 2' బీట్ చేసింది.
Also Read: సన్నీ లియోన్, పాయల్‌ను మేనేజ్ చేద్దామనుకున్న విష్ణు మంచు! కానీ...
తమిళనాడులో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి కన్నడ సినిమాగా కూడా 'కెజియఫ్ 2' రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ. 1160 కోట్లు. త్వరలో 1200 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోనులో మాట్లాడిన మహేష్
#KGFChapter2 WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) May 10, 2022
REFUSES to give up to new releases.
Week 1 - ₹ 720.31 cr
Week 2 - ₹ 223.51 cr
Week 3 - ₹ 140.55 cr
Week 4
Day 1 - ₹ 11.46 cr
Day 2 - ₹ 8.90 cr
Day 3 - ₹ 24.65 cr
Day 4 - ₹ 25.42 cr
Day 5 - ₹ 8.07 cr
Total - ₹ 1162.87 cr
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!
Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' విజయాలే కారణమా?
Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?
1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి