Sunny Leone Funny Video: సన్నీ లియోన్, పాయల్‌ను మేనేజ్ చేద్దామనుకున్న విష్ణు మంచు! కానీ...
సన్నీ లియోన్... పాయల్ రాజ్ పుత్... వీళ్ళిద్దరిలో విష్ణు మంచుకు ఎవరు ఇష్టం? ఆయన ఫేవరెట్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్పారు?
Vishnu Manchu Prank Video With Sunny Leone, Payal Rajput: సన్నీ లియోన్... పాయల్ రాజ్ పుత్... వీళ్ళిద్దరిలో విష్ణు మంచుకు ఎవరు అంటే ఇష్టం? ఇద్దరిలో ఆయన ఫేవరెట్ ఎవరు? అంటే... సన్నీ లియోన్ పక్కన ఉన్నప్పుడు సన్నీ అని చాలా కాన్ఫిడెంట్‌గా విష్ణు మంచు చెప్పారు. పాయల్ రాజ్ పుత్ పక్కన ఉన్నప్పుడు ఆమె అని చెప్పారు. విడి విడిగా ఉన్నప్పుడు అలా చెప్పేసి ఇద్దరినీ మేనేజ్ చేద్దామని అనుకున్నారు.
అయితే, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్... ఇద్దరూ పక్క పక్కన ఉన్నప్పుడు 'ఎవరు అంటే ఇషం? మీ ఫేవరెట్?' అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు విష్ణు మంచు ఏం చేశారో తెలుసా? 'ఆలియా భట్' అని చెప్పారు. ఇది జస్ట్ ప్రాంక్ వీడియో మాత్రమే. అయితే, ఇటువంటి స్నేహితులు మీలో ఎవరికైనా ఉంటే ట్యాగ్ చేయండని ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: 'మనీ హీస్ట్'లో మహేష్ బాబు ఏ రోల్ చేస్తారంటే?
విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'గాలి నాగేశ్వరరావు' (Gali Nageswara Rao) లో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో చిత్రీకరణ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో ఈ రీల్ చేశారు. అదీ సంగతి. ఇటీవల ప్రభుదేవా కొరియోగ్రఫీలో సినిమా ఒక సాంగ్ షూట్ చేశారు.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోనులో మాట్లాడిన మహేష్
View this post on Instagram