Mahesh Babu On Money Heist: 'మనీ హీస్ట్'లో మహేష్ బాబు ఏ రోల్ చేస్తారంటే?
ఒకవేళ 'మనీ హీస్ట్'లో నటించే అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుకు వస్తే? ఆయన ఏ రోల్ చేస్తారు? సోషల్ మీడియాలో నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నకు మహేష్ ఏం సమాధానం ఇచ్చారంటే...
సూపర్ స్టార్ మహేష్ బాబు రీమేక్ సినిమాలకు దూరం! రీమేక్స్‌లో సరేమిరా యాక్ట్ చేయనని చెప్పారు. శంకర్ దర్శకత్వంలో సినిమా చేసే వీలు ఉన్నప్పటికీ... హిందీ హిట్ '3 ఇడియట్స్'కి రీమేక్ కావడంతో నో చెప్పారు. మరి, 'మనీ హీస్ట్' (Money Heist) చేస్తారా? అంటే... చేయరు అని చెప్పాలి. అయితే, ఒక నెటిజన్ హైపోథెటికల్ క్వశ్చన్ అడిగారు.
'మనీ హీస్ట్'లో చేసే అవకాశం వస్తే... మీరు ఏ పాత్ర ఎంపిక చేస్తుకుంటారు? అని! అందుకు మహేష్ ఏం చెప్పారో తెలుసా? ఏ మాత్రం తడుముకోకుండా 'ప్రొఫెసర్' అని చెప్పారు. తెలుగులో సూపర్ హీరో మూవీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆయన అన్నారు. మార్వెల్, డీసీలో మార్వెల్‌కు ఓటు వేశారు.
సితారను భవిష్యత్తులో నటిగా చూడవచ్చా? అని అడిగితే... ''ఆల్రెడీ సితార యాక్ట్రెస్'' అని మహేష్ బాబు చెప్పారు. తమ కుటుంబంలో స్మార్ట్ పర్సన్ సితార అని అన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే... 'మే వైఫ్ (నమ్రత)' అని సమాధానం ఇచ్చారు. నమ్రతలో మీకు నచ్చేది ఏంటి? అని అడిగితే... 'ప్రతిదీ. అందుకే, తనను పెళ్లి చేసుకున్నాను' అని చెప్పారు. తన ఫేవరెట్ ఫుల్ బాల్ ప్లేయర్ రోనాల్డో అని సూపర్ స్టార్ట్ తెలిపారు.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోనులో మాట్లాడిన మహేష్
'సర్కారు వారి పాట'లో మహేష్ బాబుకు ఫేవరెట్ డైలాగ్ ఏదో తెలుసా? 'మైంటైన్ చేయలేక దూల తీరిపోతుందయ్యా'. అవును... ఈ డైలాగ్ చెబుతూ ఆయన నవ్వేశారు.
Also Read: ఆ నిర్ణయం నాది కాదు & గౌతమ్ వేరు, సితార వేరు! - పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే?
View this post on Instagram