Mahesh Babu: ఆ నిర్ణయం నాది కాదు & గౌతమ్ వేరు, సితార వేరు! - పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే?
యాక్టర్ కావడం తన డ్రీమ్ అని మహేష్ బాబు కుమార్తె సితార చెప్పారు. మరి, గౌతమ్ సంగతి ఏంటి? పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. నటనలో, వ్యక్తిత్వంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మహేష్ బాబుకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. 'వన్ నేనొక్కడినే'లో అబ్బాయి గౌతమ్ నటించారు. లేటెస్ట్ 'సర్కారు వారి పాట' సినిమా 'పెన్నీ...' ప్రమోషనల్ సాంగ్‌లో అమ్మాయి సితార కనిపించింది. తన డ్రీమ్ యాక్టర్ కావడం అని చెప్పింది. ఈ నిర్ణయంపై, పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే...
'నేను 'డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని నేను అనుకోవడం లేదు. యాక్టర్ అవుతా. అది నా డ్రీమ్' అని సితార చెప్పింది. మీరు, నమ్రత ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు?
నిజాయతీగా చెప్పాలంటే... మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది నా నిర్ణయం కాదు. సితార పాపే డెసిషన్ తీసుకుంది. ఈతరం పిల్లలు తమ నిర్ణయాలు తామే తీసుకుంటున్నారు. కరోనా కారణంగా రెండు మూడేళ్ళుగా పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. సితారను దగ్గర నుంచి చూశా. పిల్లలు చాలా త్వరగా పెరుగుతున్నారు. తాను యాక్టర్ కావాలని అనుకుంది. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హర్. తనను చూస్తే గర్వంగా ఉంది.
సోషల్ మీడియాలో సితార కనిపించిన అంతగా గౌతమ్ ఎందుకు కనిపించడు?
కొంత మందికి కొన్ని నచ్చవు. గౌతమ్ వేరే, సితార వేరే! (నవ్వులు) బేసిగ్గా గౌతమ్ కూడా సితారతో ఎప్పుడూ చెబుతాడు... 'నీకు వేరే పని లేదా? ఎప్పుడూ యూట్యూబ్, యూట్యూబ్ అంటావ్' అని! సితారకు ఈ పనులు ఇష్టం. గౌతమ్ కు వేరే యాక్టివిటీస్ ఇష్టం.
మీ వారసుడిగా వస్తాడు కదా!
అది మీరు గౌతమ్ ను అడగాలి అండీ! ఏ కెరీర్ ఎంపిక చేసుకోవాలనేది అతని ఇష్టం. అది నా చేతుల్లో లేదు.
'వన్ నేనొక్కడినే'లో అబ్బాయితో, 'సర్కారు వారి పాట'లో 'పెన్నీ' పాటలో అమ్మాయితో నటించారు. ఇద్దరితో కలిసి నటించేది ఎప్పుడు?
అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. కథ కుదరాలి కదా!
Also Read: 'సర్కారు' కథలో మార్పులు చేయలేదు, మేం నమ్మింది చేశాం! - మహేష్ బాబు ఇంటర్వ్యూ
నాన్నగారి బయోపిక్ చేయమని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా?
లేదండీ. మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే... నా కాళ్ళు వణుకుతున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టు... నాన్న నాకు దేవుడితో సమానం. ఎవరైనా సంప్రదించినా నేను చేయలేను. ఆయన పాత్రలో నటించగలనని అనుకోవడం లేదు.
Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్