By: ABP Desam | Updated at : 10 May 2022 06:04 PM (IST)
మహేష్ బాబు
''కథకు ఏం కావాలో... అదే చేశాను'' అని మహేష్ బాబు చెప్పారు. పరశురామ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. మే 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారంటే...
'సర్కారు వారి పాట' గురించి మీరు ఏం చెబుతారు?
నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన చిత్రమిది. నా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ఈ విషయంలో ఫుల్ క్రెడిట్ దర్శకుడు పరశురామ్‌కు ఇవ్వాలి. ఆయన కథ నేరేట్ చేసినప్పుడు నచ్చింది. కొన్ని సీన్లు చేసినప్పుడు 'పోకిరి' రోజులు గుర్తు వచ్చాయి. నేను కథకు ఏం కావాలో అదే చేస్తాను. 'సర్కారు...'లో పాత్రకు బౌండరీలు లేవు. అందువల్ల, నా పని ఈజీ అయ్యింది. అయితే... కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చేయడం కొంచెం కష్టమైంది.
'మురారి', 'అతడు', 'దూకుడు' - మీరు మంచి మంచి సినిమాలు చేశారు. అయితే, ప్రతిసారీ కొత్త సినిమా చేసినప్పుడు 'పోకిరి'ని ఎందుకు తీసుకొస్తారు?
ప్రతిసారీ 'పోకిరి' అని కాదు. పర్టిక్యులర్‌గా ఈ సినిమాకు వస్తే... ఆ పెర్ఫార్మన్స్ వచ్చి 'పోకిరి' లాంటిది. ఆ మీటర్ లో ఉంటుంది. మీరు థియేటర్లలో 'పోకిరి' చూస్తే... ఒక మాస్ ఫీలింగ్, ఒక యుఫోరియా ఉంటుంది. అటువంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ దొరికిందని ఫీల్ అవుతున్నారు.
పరశురామ్‌తో సినిమా అన్నప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. స్టార్ దర్శకులతో కాకుండా కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఏంటని కొందరు అనుకున్నారు. మీరు ఏం అనుకుంటారు?
పరశురామ్ రైటింగ్‌లో ఒక స్పార్క్ ఉంటుంది. నాకు అది నచ్చింది. డైరెక్టర్ రైటర్ అయితే బావుంటుంది. 'గీత గోవిందం' నాకు విపరీతంగా నచ్చింది. అదొక మంచి సినిమా. దాని తర్వాత 'సర్కారు వారి పాట' కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. అంతకు మించి ఏమీ ఆలోచించలేదు.
సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ఈ సమయంలో మార్పులు ఏమైనా చేశారా?
లేదండీ. మాకు ఎక్కువ ఆలస్యం ఏమీ కాలేదు. మూడు నాలుగు నెలలు లేట్ అయ్యిందంతే! ఇండస్ట్రీలో చాలా మంది సినిమాలు వాయిదా వేసుకోక తప్పలేదు. అయితే, ఈ సమయంలో మేం మార్పులు ఏమీ చేయలేదు. మేం నమ్మింది చేశాం.
సినిమా ఎక్కువ శాతం అమెరికా నేపథ్యంలో ఉంటుందా?
లేదు... ఫస్టాఫ్ అంతా అమెరికా నేపథ్యంలో ఉంటుంది. సెకండాఫ్ విశాఖలో ఉంటుంది.
మీ లుక్ కొత్తగా ఉంది, మెడపై టాటూ హైలైట్ అయ్యింది. ఈ ఐడియా ఎవరిది?
దర్శకుడు పరశురామ్‌ది. మే 31న సినిమా అనౌన్స్ చేయాలన్నారు. అప్పటికి నా జుట్టు కూడా అంత పెరగలేదు. 'భరత్ అనే నేను'లో స్టిల్ అనుకుంట. దర్శకుడు పరశురామ్ అలా డిజైన్ చేయించారు. టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు అందరికీ లుక్, స్టైల్ నచ్చాయి. లాస్ట్ సినిమాల్లో మెసేజ్ ఎక్కువ ఉండటంతో మహేష్ బాబును ఇలా చూడటం రీఫ్రెషింగ్ గా ఉందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది.
కీర్తీ సురేష్ క్యారెక్టర్ గురించి?
సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. కీర్తీ సురేష్ కూడా చాలా బాగా చేసింది. మా మధ్య లవ్ ట్రాక్ కొత్తగా ఉంటుంది. సినిమాకు హైలైట్ అవుతుంది.
మీ గ్లామర్ మ్యాచ్ చేయడం కష్టమని కీర్తీ సురేష్ చెప్పారు. ట్రైలర్‌లో కూడా ఒక డైలాగ్ ఉంది. మైంటైన్ చేయడం ఎంత కష్టం?
కష్టం ఏం కాదు, నేను హ్యాపీగా ఉన్నాను. అసలు, ఆ డైలాగ్ నా పుట్టిన రోజుకు విడుదల చేసిన టీజర్‌లో పెడదామని దర్శకుడు పరశురామ్ అన్నారు. నేనే ట్రైలర్‌లో పెట్టమని చెప్పా. థియేటర్లలో ఇంకా ఎంజాయ్ చేస్తారు. అది అప్పటికప్పుడు రాసిన డైలాగ్. ముందు అనుకున్నది కాదు.
విలన్ రోల్ చేసిన సముద్రఖని గురించి...
ఆయన చాలా బాగా చేశారు. ఆయనకు కళ్లజోళ్లు అంటే ఇష్టం అంట. 'సార్... ఈ సినిమాలో మీరు చాలా కళ్లజోళ్లు వాడారు. ఒకటి ఇవ్వండి. మీ గుర్తుగా దాచుకుంటా' అని సముద్రఖని అడిగారు. డబ్బింగ్ చెప్పినప్పుడు ఆయన పెర్ఫార్మన్స్ చూసి... ఒకటి కళ్ళజోడు కాదు, ఏకంగా షాప్ కొనేయాలని అనిపించింది. అంత బాగా నటించారు.
Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్
కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో మార్పులు వచ్చాయని కొందరు అంటున్నారు. కథల ఎంపిక మారుతుందని ఇంకొందరు అంటున్నారు. మీరు ఏం చెబుతారు?
కమర్షియల్ సినిమా ఎప్పుడూ కమర్షియల్ సినిమాయే. మారిందని అనుకుంటే పొరబాటే.
Also Read: మహేష్ కుమార్తె డ్రీమ్ ఏంటో తెలుసా? క్లారిటీగా చెప్పిన సితార
'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి చేస్తున్నారు. ఆ సినిమా గురించి...
కొత్తగా ఉంటుంది. ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం ఎర్లీ అవుతుంది. నాకు త్రివిక్రమ్ రైటింగ్ అంటే ఇష్టం. ఆయన సినిమా కోసం నేనూ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నాను.
Also Read: రాజమౌళి - మహేష్ బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుందంటే?
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!
Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' విజయాలే కారణమా?
Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?
1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి