By: ABP Desam | Updated at : 10 May 2022 12:53 PM (IST)
మహేష్ బాబు, సితార ఘట్టమనేని
ఘట్టమనేని కుటుంబంలో మూడో తరం కూడా సినిమాల్లోకి వచ్చింది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ 'వన్ నేనొక్కడినే' సినిమాలో నటించారు. అది గౌతమ్ డెబ్యూ అనుకోవచ్చు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) సినిమాతో మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని కూడా ఎంట్రీ ఇచ్చారు. 'పైసా పైసా' పాటలో ఆమె సందడి చేశారు. అఫ్ కోర్స్... అది ప్రమోషనల్ సాంగ్ అనుకోండి. అయితే, అందులో సితార స్టైల్, స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) కొన్ని రోజులుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతే కాదు... ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. 'కళావతి...' పాటకు రీల్ చేశారు. ఒకసారి మహేష్ బాబును ఇంటర్వ్యూ చేశారు. స్నేహితులతో సరదాగా ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... సితార యాక్టర్ కావాలని అనుకుంటున్నారు.
''డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని నేను అనుకోవడం లేదు. యాక్టర్ కావాలని అనుకుంటున్నాను. అది నా డ్రీమ్'' అని లేటెస్ట్ ఇంటర్వ్యూలో సితార ఘట్టమనేని తెలిపారు. సో... భవిష్యత్తులో ఆమె యాక్టర్ అవ్వడం ఖాయం అన్నమాట.
Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ ప్రయాణం సూపర్ స్టార్ కృష్ణతో స్టార్ట్ అయ్యింది. ఆయన మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు. ప్రేక్షకుల్లో ఎనలేని గౌరవం, అభిమానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు, కుమార్తె మంజుల వచ్చారు. రమేష్, మంజుల కొన్ని సినిమాలు చేసి నటనకు దూరంగా ఉన్నారు. ఇటీవల 'మళ్ళీ మొదలైంది' సినిమాలో మంజుల కనిపించారు. మరోవైపు మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె, కుమారుడు కూడా సినిమాల్లోకి వస్తున్నారు.
NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
Ram Charan-NTR: నీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేను - రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్‌డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Navjot Singh Sidhu: లొంగిపోవడానికి సమయం కోరిన సిద్ధూ- నో చెప్పిన కోర్టు!
Right To Dignity: సెక్స్ వర్కర్స్కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !
Elon Musk: ఎలన్ మస్క్ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం