Ashu Reddy On Nagarjuna: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?
'బిగ్ బాస్ ఓటీటీ' నుంచి లాస్ట్ సండే అషురెడ్డి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గురించి ఆమె ఏం చెప్పిందో చూశారా?
'బిగ్ బాస్'కు అషురెడ్డి కొత్త కాదు. ఈ షో హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జునకూ ఆమె కొత్త కాదు. 'స్టార్ మా'లో టెలికాస్ట్ అయిన 'బిగ్ బాస్' సీజన్ 3లో ఆమె పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు 'బిగ్ బాస్ ఓటీటీ'లోనూ సందడి చేశారు. ఈసారి హౌస్‌లో చివరి వరకూ ఆమె ఉంటుందని చాలా మంది ఊహించారు. అయితే, అనూహ్యంగా లాస్ట్ సండే ఆమె ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఇంటి నుంచి సొంత ఇంటికి చేరుకున్న అషురెడ్డి... నాగార్జున గురించి, షో గురించి ఏం చెప్పారో తెలుసా?
కింగ్ అక్కినేని నాగార్జునకు తాను ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అషురెడ్డి... ''ఈ ఇంటిలో లిటిల్ గాళ్ (చిన్నారి పిల్ల)ను నేను మిస్ అవుతానని నాగార్జున గారు చెప్పారు. బిగ్ బాస్ ప్రపంచంలో ఆయన ఎప్పుడూ మంచిగా ఉంటారు. మోటివేషన్ ఇస్తారు. ఆయన దగ్గర ఎనర్జీ ఉంటుంది. అందరినీ గౌరవిస్తూ మంచి హోస్ట్ గా ఉన్నందుకు థాంక్స్. నా హృదయంలో మీది ఎప్పుడూ ప్రత్యేక స్థానం'' అని అషురెడ్డి పేర్కొన్నారు.
'బిగ్ బాస్' ఇంటిలో తాను ఎంతో నేర్చుకున్నాని, ఇంతకు ముందు కంటే ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యానని అషురెడ్డి తెలిపారు. గతంలో 'చల్ మోహన్ రంగ', 'శంఖం', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాల్లో ఆమె నటించారు. ఇప్పుడు ఆమెకు అవకాశాలు వస్తున్నాయని, మరిన్ని సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్టు సమాచారం.
Also Read: 'సర్కస్'లో గోల్ మాల్ - క్రిస్మస్‌కు రణ్‌వీర్, పూజా హెగ్డే షో
View this post on Instagram