Cirkus Movie First Look Poster: 'సర్కస్'లో గోల్ మాల్ - క్రిస్మస్‌కు రణ్‌వీర్, పూజా హెగ్డే షో
రణ్‌వీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'సర్కస్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సినిమా క్రిస్మస్‌కు విడుదల కానుందని వెల్లడించారు.
క్రిస్మస్‌కు షో షురూ అవుతుందని బీటౌన్ సెన్సేషనల్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranvir Singh) చెప్పారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా 'సర్కస్' (Cirkus Movie). ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ (Cirkus Movie First Look) విడుదల చేశారు. అలాగే, విడుదల తేదీ (Cirkus Movie Release Date) కూడా వెల్లడించారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు.
''మరోసారి ప్రేక్షకులను సినిమా హాళ్ళకు తీసుకు రావాల్సిన సమయం వచ్చింది. 16 ఏళ్ళ క్రితం 'గోల్ మాల్' విడుదలైంది. అప్పుడు మీరు చూపించిన ఆదరణ ఈ రోజు నన్ను ఇంతటి వాడిని చేసింది. మీకు, మీకు కుటుంబ సభ్యులకు క్రిస్మస్ గిఫ్ట్ ఈ 'సర్కస్'. ఎందుకంటే... 'సర్కస్'లో గోల్ మాల్ చాలా ఉంది'' అని దర్శకుడు రోహిత్ శెట్టి పేర్కొన్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి కలయికలో ఇంతకు ముందు 'సింబ' వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ హిట్ సినిమా 'టెంపర్' కథకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆ సినిమా తెరకెక్కించారు. ఈసారి కంప్లీట్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Also Read: తల్లి కాబోతున్న మరో హీరోయిన్, బర్త్ డేకి బేబీ బంప్‌తో...
View this post on Instagram