By: ABP Desam | Updated at : 10 May 2022 09:00 AM (IST)
నమిత తల్లి కాబోతున్నారు.
కథానాయిక నమిత గుర్తు ఉన్నారా? నట సింహం నందమూరి బాలకృష్ణ 'సింహా'లో రెండో కథానాయికగా కనిపించారు. ఒక పాటలో ఆడి పాడారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బిల్లా' సినిమాలోనూ నటించారు. అసలు, కథానాయికగా ఆమె కెరీర్ మొదలైంది తెలుగు సినిమా 'సొంతం'తో! ఆ తర్వాత తమిళ, మలయాళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేశారు. ఇప్పుడు నమిత ప్రస్తావన ఎందుకంటే... ఆమె తల్లి కాబోతున్నారు.
మే 10... ఈ రోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియాలో వెల్లడించారు. బేబీ బంప్‌తో ఫొటోస్ పోస్ట్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు. ''మాతృత్వం... నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేనూ మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు... మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్'' అని నమిత పేర్కొన్నారు.
వీరేంద్ర చౌదరితో 2017లో నమిత వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు, చేస్తున్నారు. గర్భవతి కావడంతో కొన్ని రోజులు సినిమాలకు తాత్కాలిక విరామం ఇవ్వక తప్పదు. నమితకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు చాలా మంది ప్రెగ్నెంట్ అయినందుకు కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.
Also Read: నాన్నగారి బయోపిక్ చేయలేను - క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !