Mahesh Babu: నాన్నగారి బయోపిక్ చేయలేను - క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు
కృష్ణ బయోపిక్ పై మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే నేను ఆనందంగా చూస్తాను. నేనైతే చేయలేను. ఆయన నా దేవుడు. ఎవరైనా బయోపిక్ డైరెక్ట్ చేయడానికి ముందుకొస్తే ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ' అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది.
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఎంతో ఎమోషనల్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి తెలుగు మీడియాతో పాటు బాలీవుడ్ మీడియా కూడా ఎటెండ్ అయింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మహేష్ బాబు. 'మేజర్' సినిమా తీయడం ఎంతో గర్వంగా ఉందని.. ఈ సినిమా చూశానని అద్భుతంగా వచ్చిందని అన్నారు.
అనంతరం కృష్ణ గారి బయోపిక్ ను ఎప్పుడు తీస్తారని..? ఓ విలేకరి ప్రశ్నించగా.. 'నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే నేను ఆనందంగా చూస్తాను. నేనైతే చేయలేను. ఆయన నా దేవుడు. ఎవరైనా బయోపిక్ డైరెక్ట్ చేయడానికి ముందుకొస్తే ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ' అంటూ చెప్పుకొచ్చారు. అంటే కృష్ణ బయోపిక్ లో నటించే ఉద్దేశం మహేష్ బాబుకి లేదన్నమాట. మొత్తానికి తన తండ్రి బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేశారు మహేష్ బాబు.
Also Read: 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తే' - 'మేజర్' ట్రైలర్ వేరే లెవెల్
View this post on Instagram
View this post on Instagram