Court Box Office Collections Day 1: బాక్సాఫీస్ వద్ద 'కోర్ట్' మూవీ ప్రభంజనం - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Court First Day Collections Worldwide: నాని సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన 'కోర్ట్' మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే రూ.8 కోట్లకు పైగా వసూలు చేసింది.

Priyadarshi's Court Movie First Day Collections: నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా టాలీవుడ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్: ద స్టేట్ వర్సెస్ నోబడీ' (Court: The State Versus Nobody). విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించగా పాజిటవ్ టాక్ తెచ్చుకుంది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.
ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే.?
'కోర్ట్' (Court) మూవీ ప్రీమియర్స్‌తో సహా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. 'ఇది బ్లాక్ బస్టర్ తీర్పు' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కేవలం 24 గంటల్లోనే బుక్ మై షోలో 21 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అటు, అమెరికాలోనూ ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకెళ్తుందని మూవీ టీం వెల్లడించింది. ఇప్పటికే $200K (దాదాపు రూ.2 కోట్లు) మార్కును దాటినట్లు తెలిపింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి ఇది $500K మార్కును దాటొచ్చని అంచనా వేసింది.
BLOCKBUSTER VERDICT FOR #Court 💥💥💥#CourtTelugu collects a gross of 8.10 + CRORES WORLDWIDE on Day 1 with premieres included ❤🔥
— Wall Poster Cinema (@walpostercinema) March 15, 2025
Book your tickets now!
▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️
Presented by Natural Star @NameisNani
Starring @PriyadarshiPN… pic.twitter.com/Xt6O91Y7CK
Also Read: 'ప్లీజ్.. పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి' - తమిళులపై పవన్ కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ 'కోర్ట్' మూవీని తెరకెక్కించగా.. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, 'శుభలేఖ' సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. 'మంగపతి' విలన్ రోల్‌లో శివాజీ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీకి ప్రశంసలు దక్కాయి. పోక్సో యాక్ట్ నేపథ్యంలో చట్టాలపై అవగాహన కల్పించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
కథేంటంటే..?
2013 నేపథ్యంలో సాగే కథ 'కోర్ట్' మూవీ. ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. ఓ ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేసే క్రమంలో పెద్దింటి అమ్మాయితో పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలుస్తుంది. పరువు, ప్రతిష్టలే ప్రాణంగా భావించే అమ్మాయి మామయ్య పగతో యువకునిపై కఠినమైన పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించి జైల్లో పెట్టిస్తాడు.
ఏ తప్పూ చేయని యువకుడు అకారణంగా జైల్లో మగ్గుతాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతుంది. వీరి బాధ తెలుసుకున్న ఓ యువ లాయర్ పెద్దలందరినీ ఎదిరించి మరీ ఈ కేసును టేకప్ చేసి యువకుని కోసం న్యాయ పోరాటం చేస్తాడు. మరి అతను విజయం సాధించాడా..? పేదింటి యువకుడు ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
ఆ ఓటీటీలోకి అప్పుడే..
ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్' రూ.9 కోట్లకు దక్కించుకోగా.. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

