Assembly Election Results 2024 LIVE: అరుణాచల్‌లో జోరు ప్రదర్శిస్తున్న బీజేపీ, సిక్కింలో ఆ పార్టీదే అధికారం - లైవ్ అప్ డేట్స్
Arunachal Pradesh Sikkim Assembly Election Results 2024 LIVE: అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో నేడు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది. అరుణాచల్ లో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది.
LIVE
Background
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు (జూన్ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఉదయం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా.. ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. మిగిలిన 50 స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఫలితాలు సార్వత్రిక ఫలితాలతో పాటే విడుదలవుతాయని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ, తర్వాత ఈ తేదీలను ఈసీ మార్పు చేసింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల విడుదల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. జూన్ 4 వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలయ్యే ఎన్నికల ఫలితాలతో కాకుండా అంతకు ముందే ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేయనున్నట్లుగా గత మార్చిలోనే ప్రకటించింది. అందులో భాగంగా జూన్ 2వ తేదీనే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయని ప్రకటించింది. ఈ మేరకు ఈసీ గత మార్చి 17న అధికారికంగా ప్రకటించింది.
ఇందుకు కారణం లేకపోలేదు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతోనే ముగుస్తుంది. అయితే, జూన్ 4న ఫలితాలు విడుదల అవుతాయి. అంటే, జూన్ 2న అసెంబ్లీ గడువు ముగిసిన తరవాత జూన్ 4కి మధ్య రెండు రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్‌లలో ప్రభుత్వమే ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగానే జూన్ 2నే ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంటే అసెంబ్లీ గడువు ముగిసిన రోజే ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఈ రోజే కొత్త ప్రభుత్వం ఏంటో ఖరారు అయిపోతుంది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే అధికారం
BJP in Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగనుంది. అక్కడ మొత్తం 60 స్థానాలు ఉండగా.. 31 స్థానాలు గెల్చుకుంటే అధికారం చేజిక్కించుకోవచ్చు. అలాంటిది పది స్థానాలు ఎన్నికల ముందే అక్కడ ఏకగ్రీవం అయ్యాయి. నేడు జరుగుతున్న మిగిలిన స్థానాల ఓట్ల లెక్కింపులో మెజార్టీ మార్కుకు అవసరమైన 31 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అధిగమించింది. ఏకగ్రీవమైన 10 స్థానాలు కలుపుకొని కనీసం 33 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మరో 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీనే జోరు ప్రదర్శిస్తోంది.
Sikkim Latest News: సిక్కింలో ఆ పార్టీదే అధికారం, ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
Sikkim Election Result: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాల్లో 17 మెజారిటీ మార్కును అధిగమించి అధికారాన్ని నిలుపుకుంది. SKM 18 స్థానాల్లో విజయం సాధించి 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Arunachal Pradesh Election Results: 27 చోట్ల ముందంజలో బీజేపీ
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధికార బీజేపీ మేజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటింది. ఏకగ్రీవంగా ఎన్నికైన 10 స్థానాలు కాకుండా మరో 27 చోట్ల ఆధిక్యంలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 60 అసెంబ్లీ స్థానాల్లో 31.
#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong
— ANI (@ANI) June 2, 2024
The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI
Arunachal Pradesh Election Result: అరుణాచల్ ప్రదేశ్ లో తాజా ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇవీ
BJP in Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ సగం మార్కును దాటింది. ఇప్పటికే ఏకగ్రీవంగా గెలిచిన 10 స్థానాలు కాక.. మరో 23 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 60 స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 31.
Arunachal Pradesh News: అరుణాచల్‌లో మేజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
Arunachal Pradesh Election Counting: అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పాపుమ్ పారే జిల్లాలోని ఓ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద వర్షం కురుస్తూ పరిస్థిత ఇలా ఉంది. ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ 10 సీట్లను ఏకగ్రీవంగా గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 23 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 8 సీట్లలో ఆధిక్యంలో ఉంది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 3 చోట్ల లీడ్ లో ఉంది.
#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in the Papum Pare district
— ANI (@ANI) June 2, 2024
The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of… pic.twitter.com/r7DSc0code