అన్వేషించండి

Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్

Pink ball Test: తొలి టెస్టులో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో అన్ని రంగాల్లో రాణించి విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. 

IND vs AUS Adelaide Test: బోర్డర్- గావస్కర్ టెస్టు సిరీస్ లో భారత్ కు తొలి పరాజయం ఎదురైది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో డే/నైట్ టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో ఘెర పరాజయం పాలైంది. ఆదివారం మూడోరోజు ఓవర్ నైట్ స్కోరు 128/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 175 పరుగులకే కుప్పకూలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42, 6 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.  రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. 36.5 ఓవర్లలో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాల్ తో జట్టును ముందుండి నడిపించాడు. 57 పరుగులకు ఐదు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. స్కాట్ బోలాండ్ కు మూడు, మిషెల్ స్టార్క్ కి రెండు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కు కేవలం 19 పరుగుల స్పల్ప టార్గెట్ ను ఆసీస్ ముందు భారత్ ఉంచింది. 3.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా కంగారూలు ఈ టార్గెట్ ను సునాయాసంగా ఛేదించారు. 

బ్యాటర్ల మూకుమ్మడి వైఫల్యం..
బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉన్న పిచ్ పై భారత బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. మరోవైపు అలవాటు లేని పింక్ బంతితో ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్ ఆడాల్సి రావడం కూడా జట్టు ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కిందటిసారి పర్యటనలో కూడా అడిలైడ్ లో జరిగిన డే/నైట్ టెస్టులో భారత్ పరాజయం పాలైంది. అప్పుడైతే అవమానకరంగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. 

జట్టు కూర్పు కలిసి రాలేదా..?
పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత్.. ఈ మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులు చేసింది. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ స్తానంలో శుభమాన్ గిల్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు. గిల్ రెండు ఇన్నింగ్స్ లలో ఫర్వాలేదనిపంచగా, రోహిత్, అశ్విన్ మాత్రం విఫలమయ్యారు. ముఖ్యంగా ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్.. 3, 6 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. గత కొంతకాలంగా తను విఫలమవుతున్నాడు. వీలైనంత త్వరగా బ్యాట్ తో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఆల్ రౌండర్ అశ్విన్ అటు బ్యాటింగ్ లో విఫలం కాగా, ఇటు బౌలింగ్ లో ఒక వికెట్ మాత్రమే సాధించాడు.   ఇక బౌలింగ్ లో బుమ్రా అదరగొడుతుండగా,, సిరాజ్ ఫర్వలేదనిపించాడు. హర్షిత్ రాణా మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. ఆల్ రౌండర్ కోటాలో ఆడుతున్న నితీశ్ అటు బ్యాట్ తో ఇటు బాల్ తోనూ సత్తా చాటుతున్నాడు. బ్రిస్బేన్ లో జరిగే మూడో టెస్టుకు ముందు జట్టు కూర్పులో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ పరుగులు సాధిస్తేనే సిరీస్ లో ముందంజ వేసే అవకాశముంది. ఈ సిరీస్ లో గెలుపొందితేనే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో తుదిపోరుకు భారత్ అర్హత సాధించే అవకాశముంది. 

Also Read: Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget