JEE Main 2022 Registrations Soon: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్.. అర్హత నుంచి పరీక్ష వరకు తెలుసుకోవాల్సినవి ఇవే
త్వరలో జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్ లో త్వరలో తెలియజేస్తారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. త్వరలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్-2022 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. దేశంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం.. ఈ అర్హత పరీక్ష జరగనుంది. 2022 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు నాలుగు సెషన్లలో జేఈఈ పరీక్షలు జరగనున్నాయి. కిందటి ఏడాది కరోనా కారణంగా .. మెుత్తం నాలుగు సెషన్లలో నిర్వహించారు. జేఈఈ మెయిన్ లోని టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు.. ఐఐటీ ప్రవేశాల కోసం జరిగే.. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్ష రాయోచ్చు. రిజిస్ట్రేషన్ తేదీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో తెలియజేస్తారు.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు విద్యార్థులు జేఈఈ మెయిన్ 2022 అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. అధికారులు JEE మెయిన్ 2022 యొక్క అర్హత ప్రమాణాలను అధికారిక బ్రోచర్‌లో విడుదల చేసినప్పుడు చూసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని వివరాలు గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు 12వ తరగతి లేదా 2020, 2021లో ఏదైనా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
BTech/ BE కోర్సులలో ప్రవేశం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు 12వ తరగతిలో భౌతిక శాస్త్రం, గణితం మరియు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, బయోటెక్నాలజీ లేదా సాంకేతిక వృత్తిపరమైన సబ్జెక్ట్‌లను కలిగి ఉండాలి. BArch కోర్సులకు, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు BPlan తప్పనిసరి సబ్జెక్టుతోపాటు గణితం కూడా ఉండాలి.
JEE మెయిన్ 2022: కావాల్సిన పత్రాలు
- దరఖాస్తుదారు ఫోటో స్కాన్ చేసిన కాపీ
- దరఖాస్తుదారు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీ
- కేటగిరీ సర్టిఫికెట్లు(వర్తిస్తే)
- ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ మొదలైన ఫోటో గుర్తింపు రుజువు
- 10వ తరగతి మార్కు షీట్
- ఇంటర్మీడియట్ మార్క్ షీట్
JEE మెయిన్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి
స్టెప్-1: ఇమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్ మరియు పేరు వంటి ప్రాథమిక వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోండి. అభ్యర్థులు కూడా పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసి సెక్యూరిటీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత, ప్రత్యేకమైన JEE మెయిన్ 2022 అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. తదుపరి లాగ్-ఇన్‌ల కోసం సేవ్ చేయాలి
స్టెప్-2: రెండో దశలో అభ్యర్థులు అదే అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. అవసరమైన అన్ని వివరాలను సమర్పించాలి.
స్టెప్-3: అన్ని సంబంధిత డాక్యుమెంట్‌లను పేర్కొన్న ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. అధికారిక నోటిఫికేషన్‌లో స్పెసిఫికేషన్‌లు వివరంగా ఉంటాయి.
స్టెప్-4: NTA JEE మెయిన్ 2022 దరఖాస్తు కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ లేదా ఏదైనా ఇతర ఎంపిక ద్వారా చెల్లింపు చేయవచ్చు.
స్టెప్-5: చెల్లింపు చేసిన తర్వాత, అభ్యర్థులు తదుపరి ఉపయోగం కోసం సమర్పించిన దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటౌట్ తీసుకోవాలి.
పేపర్ విధానం..
ప్రశ్నపత్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. పేపర్-1లో 90 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి 75 ప్రశ్నలకు మాత్రమే రాయాలి. 15 ఐచ్ఛిక ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు. పేపర్ వారీగా పరిశీలిస్తే..
బీఈ/బీటెక్(పేపర్-1 నాలుగు సెషన్‌సలో ఉంటుంది): ప్రతి సబ్జెక్టు రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్-ఏలో అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్‌లో ఉంటాయి, సెక్షన్-బిలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఏవైనా ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, ఈ విభాగంలో నెగిటివ్ మార్కులు ఉండవు.
బీఆర్క్(పేపర్ 2ఏ)- పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటాయి. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు రాయాలి. వీటికి నెగిటివ్ మార్కులు ఉండవు.
బీ-ప్లానింగ్(పేపర్ 2బీ) ఇందులోని పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటారుు. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో 10 ప్రశ్నలు ఉంటారుు. వాటిలో ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, వీటికీ నెగిటివ్ మార్కులు ఉండవు.
సెక్షన్ బీలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో అభ్యర్థి ఏవైనా ఐదు ప్రశ్నలను ఎంచుకుని జవాబులు రాయవచ్చు. పేపర్ సబ్మిట్ చేసే ముందు ఎంచుకున్న ప్రశ్నలకు సమాధానాలను మార్చుకునే అవకాశం, మొత్తం ప్రశ్నలను కూడా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థి ఇంతకుముందు ఎంచుకున్న ప్రశ్నలకు భిన్నమైన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. మొత్తంమ్మీద సెక్షన్-బీలోని ఐదు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి.
Also Read: AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం... ఈ ఏడాది 7 పేపర్లతోనే పరీక్షల నిర్వహణ
Also Read: TS Inter Results : కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి