అన్వేషించండి

what is Waqf: వక్ఫ్ సవరణ బిల్లు చుట్టూ రాజకీయం, ఇంతకీ వక్ఫ్ అంటే అర్థం ఏంటీ? 

what is Waqf:వక్ఫ్ సవరణ బిల్లు చుట్టూ రాజకీయం నడుస్తోంది. లోక్‌సభలో బిల్లు పెట్టిన కేంద్రం దీనిపై చాలా సుదీర్ఘంగా చర్చిస్తోంది. ఇంతకీ వక్ఫ్ అంటే అర్థం ఏంటీ? ఇవి ఎన్నిరకాలు

What Is Waqf: దేశ వక్ఫ్ బోర్డు నిర్మాణంలో సవరణలు చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై భారత పార్లమెంటు ఉదయం నుంచి చర్చిస్తోంది. బుధవారం (ఏప్రిల్ 2)న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. అందుకే గత కొంతకాలంగా ఈ బిల్లు పార్లమెంట్‌లో, బయట కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్ సభలో ప్రస్తుతం ఈ బిల్లుపై  సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. 

వక్ఫ్ అంటే ఏమిటి?
ఇస్లామిక్ చట్టంలో, వక్ఫ్ అంటే దేవునికి అంకితం చేసిన ఆస్తి. ఈ పదానికి లిటరల్‌గా నిర్బంధం అని అర్థం. కానీ ఇది కొన్ని ఆస్తుల యాజమాన్య హక్కులను తీసుకొని వాటిని మతపరమైన ప్రయోజనాల కోసం లేదా దాతృత్వానికి ఉపయోగించడం అనే ఆలోచనతో చెబుతారు. వక్ఫ్ కింద తీసుకున్న అటువంటి ఆస్తిలో నగదు, భూమి, భవనాలు మొదలైనవి ఏమైనా ఉండవచ్చు.

వక్ఫ్ కింద ఉన్న ఆస్తులు శాశ్వతంగా పవిత్ర లేదా ధార్మిక ప్రయోజనాల కోసం కేటాయిస్తారు. ఈ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని మసీదులు, సెమినార్లు, ఆసుపత్రులు లేదా ధార్మిక సంస్థల నిర్మాణం, నిర్వహణ కోసం ఉపయోగించాలి. దీనిని మానవతా ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు.

వక్ఫ్ అంటే పూర్తి అర్థం ఏమిటి?
అరబిక్ పదం 'వక్ఫ్' అంటే అక్షరాలా నిర్బంధించడం, ఉంచడం లేదా కట్టబెట్టడం అని అర్థం. కాబట్టి ఆస్తిని శాశ్వతంగా దేవునికి (అల్లాహ్) కట్టబెట్టడంగా చెబుతారు. ప్రజలు తమ ఆస్తులను లేదా ఆస్తిని మతపరమైన లేదా సమాజ ప్రయోజనాల కోసం వక్ఫ్‌కు అంకితం చేయవచ్చు.

వక్ఫ్ అంటే ఎవరు?
వక్ఫ్ అంటే మతపరమైన ప్రయోజనాల కోసం ఆస్తిని అంకితం చేసిన వ్యక్తి అని అర్థం. వక్ఫ్ అనేది 'సదఖా జారియా'లో భాగం. ఇది ఇస్లామిక్ భావన. ఇది నిరంతర లేదా శాశ్వత దాతృత్వానికి సంబంధించింది. ఎందుకంటే వక్ఫ్ మరణం తర్వాత కూడా వక్ఫ్ ప్రయోజనాలు కొనసాగుతాయి.

వక్ఫ్ రకాలు
వక్ఫ్‌లో మూడు రకాలు ఉంటాయి. 'ఖైరీ వక్ఫ్' ఇందులోకి పాఠశాలలు, మసీదులు, ఆసుపత్రులు వంటి ఆస్తులు వస్తాయి. సాధారణ ప్రజల ప్రయోజనం కోసం వీటిని ఉపయోగిస్తారు. 'అల్-ఔలాద్ వక్ఫ్' అనేది ఒకరి వారసులకు ఇచ్చే ఆస్తి. వాటిని నిర్వహించడంలో కానీ సంరక్షించడంలో కానీ విఫలమైతే మాత్రం దాన్ని ప్రజా ప్రయోజనం కోసం కేటాయిస్తారు. ఈ రూల్‌తోనే దీని వీలునామా ఉంటుంది. మూడవ రకం 'ముస్య్తరక్ వక్ఫ్'. ఖైరీ, అల్-ఔలాద్ వక్ఫ్ కలయికే ఈ మూడో రకం. ఇస్లామిక్ చట్టం లేదా 'షరియా' ప్రకారం, అనేక దేశాలు నిర్దిష్ట పరిపాలనా కింద వక్ఫ్‌ను నిర్వహించాయి.

వక్ఫ్ బోర్డుల పాత్ర ఏమిటి?
ముస్లిం సమాజంలో మతపరమైన, విద్యా, దాతృత్వ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను వక్ఫ్ బోర్డులు, ఇలాంటి సంస్థలకు కేటాయించారు. ఆస్తులు ఆదాయాన్ని రెట్టింపు చేయడం. వీటిని ముస్లిం సమాజానికి, ఆర్థిక, సామాజిక అభ్యున్నతి కోసం వక్ఫ్ బోర్డులు ఉపయోగించాల్సి ఉంటుంది. వక్ఫ్ ఆస్తులు, దానధర్మాలు తరచుగా మసీదులు, పాఠశాలలు, కళాశాలలు, మతపరమైన సెమినార్లు లేదా ఇతర విద్యా సంస్థలను నిర్మించడానికి, నిర్వహించడానికి ఉపయోగిస్తారు. ఈ ఆదాయం ఇస్లామిక్ మత సంస్థలకు మద్దతు ఇవ్వడానికి లేదా దాతృత్వ లేదా మానవతా సహాయానికి కూడా ఉపయోగపడుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Embed widget