స్పా సెంటర్లో పనిచేసే అమ్మాయిలను హోటల్ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్.. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పోలీసులే
స్పా సెంటర్ లో పనిచేసే ఇద్దరు అమ్మాయిలపై గ్యాంగ్ రేప్ చేశారు. నిందితులు ముగ్గురు కాగా అందులో ఇద్దరు పోలీసులు.
హర్యానాలోని రేవారీ జిల్లాలో స్పా సెంటర్‌లోని ఇద్దరు మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిద్దరిపై ఓ కానిస్టేబుల్, హోంగార్డు కన్నుపడింది. అయితే వారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలనే పథకం వేశారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా మధ్యలో మరో వ్యక్తిని కూడా తీసుకెళ్లారు. బాధితులు ధైర్యం చేసి.. ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..
హర్యానాలోని రేవారీ జిల్లా కేంద్రంలో మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా అనిల్, అదే స్టేషన్ లో హోం గార్డుగా జితేంద్ర పనిచేస్తున్నారు. రేవారీలోని ఓ స్పా సెంటర్ పై చాలా కాలంగా కన్నేశారు వీళ్లు. ఆ స్పా సెంటర్లో పనిచేసే 20 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు ఉద్యోగులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం రాత్రి అనిల్, జితేంద్ర అమ్మాయిల ఇంట్లోకి చొరబడి వారిని బయటకు తీసుకెళ్లారు.
అనిల్, జితేంద్ర అమ్మాయిలను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించారు. అక్కడ కూడా కాసేపు వారిని వేధించారు. కాస్త దూరం వెళ్లాక ఇద్దరు మహిళలను స్కార్పియోలోకి మర్చారు. మార్గ మధ్యలో వీళ్లకి కామన్ ఫ్రెండ్ అయిన ధర్మేంద్రను వెహికల్ లోకి ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి హోటల్ గదికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు నిందితులు ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మరుసటి రోజు, బాధితుల్లోని ఓ అమ్మాయి.. స్పా సెంటర్ యజమానికి నేరం గురించి వివరించింది. దీంతో స్పా సెంటర్ యజమాని నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. హోంగార్డుపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు డీఎస్పీ మహ్మద్ జమాల్ వెల్లడించారు.
Also Read: Amazon Ganja: ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ లో గంజాయి... రవాణా గుట్టురట్టు చేసిన పోలీసులు..
Also Read: Hyderabd: 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు.. అంతా హోమో సెక్సువల్స్! రేవ్ పార్టీ భగ్నం
Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'
Also Read: Mann Ki Baat: నాకు పవర్ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ
Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి