X

Amazon Ganja: ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ లో గంజాయి... రవాణా గుట్టురట్టు చేసిన పోలీసులు..

షుగర్ వ్యాధి నివారణకు వాడే ఆయుర్వేద మెడిసిన్ పేరిట గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ రవాణాకు అమెజాన్ ను అడ్డగా మార్చుకున్నారు. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న ఈ దందాకు విశాఖ పోలీసులు చెక్ పెట్టారు.

FOLLOW US: 

గంజాయి రవాణాకు అక్రమార్కులు కొత్త దారులు వెదుకుతున్నారు. ఇటీవల కరివేపాకు పేరుతో అమెజాన్ లో గంజాయి రవాణా చేసిన ఘటన వెలుగుచూసింది. తాజాగా షుగర్ వ్యాధి నివారణకు వాడే ఆయుర్వేద మెడిసిన్ అని అమెజాన్ లో గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నించారు. ఎస్ఈబీ అధికారులు ఈ సీక్రెట్ రవాణా గుట్టురట్టు చేసి నిందితులను అరెస్టు చేశారు. అమెజాన్‌ ద్వారా విశాఖ ఏజెన్సీ  నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను విశాఖ ఎస్‌ఈబీ అధికారులు అరెస్టు చేశారు. డయాబెటిస్‌ వ్యాధి నివారణకు వాడే ఆయుర్వేద మెడిసిన్‌లో ఉపయోగించే ఆకులు అని అమెజాన్ లో రవాణా చేస్తేందుకు యత్నించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు వెల్లడించారు.

Also Read: అమెజాన్ లో  కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురు అరెస్టు

ఎనిమిది నెలలుగా అమెజాన్ లో రవాణా

గత ఎనిమిది నెలలుగా అమెజాన్‌ ఆన్ లైన్ సర్వీస్ ద్వారా సుమారుగా 900 కేజీల గంజాయి రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో విశాఖకు చెందిన ఐదుగురిని ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అమెజాన్‌ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఈనెల 21న కంచరపాలెంకు చెందిన చిలకపాటి శ్రీనివాసరావు ఇంటిలో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితుడి ఇంటిలో 48 కేజీల గంజాయితో పాటు ఎలక్ట్రానిక్‌ వెయింగ్ మిషన్, గంజాయి ప్యాకెట్లు పార్శిల్ చేసేందుకు వాడే వస్తువులు లభించాయని అధికారులు తెలిపారు. దీంతో నిందితుడు శ్రీనివాసరావుని అరెస్టు చేసి విచారించారు. మధ్యప్రదేశ్‌ కు చెందిన సురజ్‌ పావయ్య, ముకుల్‌ జైశ్వాల్‌ సూపర్‌ నేచురల్‌ స్టేవియా లీవ్స్‌ పేరిట అమెజాన్‌ లో గంజాయి బుక్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు చిలకపాటి మోహన్‌రాజు, అమెజాన్‌ పికప్‌ బాయ్స్‌ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్‌ వెంకటేశ్వర్లును ఎస్ఈబీ అరెస్టు చేసింది. 

Also Read: Vishaka: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా

Also Read:Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Also Read: Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రుళ్లు చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: amazon Visakhapatnam AP News Crime News Ganja transport

సంబంధిత కథనాలు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Amalapuram: పేరుకు ఎక్సైజ్ ఆఫీసర్.. బుద్ధి మాత్రం నీచం.. అసభ్యకర మాటలు! అక్కడ చేతులేస్తూ వెకిలి పనులు

Amalapuram: పేరుకు ఎక్సైజ్ ఆఫీసర్.. బుద్ధి మాత్రం నీచం.. అసభ్యకర మాటలు! అక్కడ చేతులేస్తూ వెకిలి పనులు

Hyderabad: రోజూ రాత్రి మేడపైకి వెళ్లొస్తున్న బాలిక.. ఒంటిపై పంటి గాట్లు, ఆరా తీసి షాకైన పేరెంట్స్!

Hyderabad: రోజూ రాత్రి మేడపైకి వెళ్లొస్తున్న బాలిక.. ఒంటిపై పంటి గాట్లు, ఆరా తీసి షాకైన పేరెంట్స్!

Crime News: డబ్బు కోసం పోలీస్‌ బాస్ వక్రమార్గం.. నకిలీ డీఎస్పీ పేరుతో కోట్లు మాయం..

Crime News: డబ్బు కోసం పోలీస్‌ బాస్ వక్రమార్గం.. నకిలీ డీఎస్పీ పేరుతో కోట్లు మాయం..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి