X

Ganja Smuggling: అమెజాన్ లో  కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురు అరెస్టు

ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ సర్వీస్ ద్వారా గంజాయి విక్రయించిన కేసులో ఏడుగురు అరెస్టు అయ్యారు. కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.

FOLLOW US: 

 అమెజాన్ లో హెర్బల్ ఉత్పత్తుల పేరుతో గంజాయి విక్రయించిన కేసులో ఏడుగురు అరెస్టు అయ్యారు. విశాఖలో ఐదుగురు, మధ్యప్రదేశ్లో ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్ఈబీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 600 కేజీల దాకా గంజాయి రవాణా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే కేసులో ఇద్దరు అమెజాన్ డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు.

 నిందితులు చిలకపాటి శ్రీనివాసరావు, జీరు కృష్ణమూర్తి, బిజ్జం కృష్ణంరాజు, చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి మోహన్ రాజును అరెస్ట్ చేసినట్టు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. వారి దగ్గర 48 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, గంజాయి ప్యాకింగ్ మెటీరియల్, అమెజాన్ టేపులు, బ్యాగులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో సూరజ్, ముకుల్ జైస్వాల్​ను అరెస్టు చేశారు.

అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని బింద్‌ జిల్లా పోలీసులు సూరజ్‌ అలియాస్‌ కల్లూ పావవియా, పింటూ అలియాస్‌ బిజేంద్ర సింగ్‌ తోమర్‌ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్‌ చేశారు. వారిని పోలీసులు విచారించారు. నాలుగు నెలలుగా అమెజాన్ లో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.  సుమారు రూ.1.10 కోట్ల విలువైన గంజాయిని తరలించినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరైన సూరజ్‌ హెర్బల్‌ ప్రోడక్ట్స్‌, కరివేపాకు విక్రేతగా అమెజాన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఇక తన పని మెుదలు పెట్టాడు. గంజాయిని తరలిస్తూ.. మధ్యప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ కూడా తరలిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

అయితే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అమెజాన్ కు మధ్యప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. మరో విషయం ఏంటంటే.. ఇంత జరుగుతున్నా.. అమెజాన్ ఈ విషయాన్ని గుర్తించలేదని తేలింది. ఈ వ్యవహారంలో లాజిస్టిక్‌ సదుపాయంతో పాటు డెలివరీ సదుపాయం సైతం అమెజాన్ ఇచ్చిందని.. కానీ ఎక్కడా దీన్ని కంపెనీ గుర్తించలేకపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా స్పందించింది.  ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పింది. 

Also Read: Vishaka: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా

 Also Read:Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Also Read: Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రుళ్లు చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Tags: amazon police madhyapradesh Ganja Smuggling vishaka ganja smuggling Ganja smuggling in Amazon

సంబంధిత కథనాలు

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి