Weather Latest Update: బంగాళాఖాతంలో అల్పపీడనం - నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు: ఐఎండీ
Weather News: హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
Weather Latest News: జూలై 27న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఉత్తర బంగాళాఖాతం మరియు పరిసర బంగ్లాదేశ్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నిన్న సాయంత్రం 05:30 గంటలకు గాంగేటిక్ పశ్చిమ బెంగాల్, పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా కేంద్రీకృతమైనది. ఇది ఈరోజు ఉదయం తిరిగి అల్పపీడన ప్రాంతంగా మారి అదే ప్రాంతంలో కొనసాగుతున్నది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి కొనసాగుతున్నది.
ఋతుపవన ద్రోణి ఈరోజు గంగానగర్, సికార్, గ్వాలియర్, సిద్ది మరియు గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ మరియు పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం గుండా వెళ్లుతూ ఉత్తర బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. ఈరోజూ గాలి విచ్చిన్నతి 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి. మీ. ఎత్తు మధ్య వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతున్నది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడ అక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, పశ్చిమ - నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 08 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలుగా నమోదైంది. 86 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘షీర్ జోన్ లేదా గాలుల కోత ఇప్పుడు భారతీయ ప్రాంతంపై సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు వద్ద సుమారుగా 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపునకు వంగి ఉంది.
జూలై 28న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.