By: ABP Desam | Updated at : 11 Aug 2023 05:25 PM (IST)
శ్రీనివాస్ గౌడ్ (ఫైల్ ఫోటో)
తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేశారా లేదా అని ప్రజా ప్రతినిధుల కోర్టు అడిగింది. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు (ఆగస్టు 11) విచారణ చేపట్టింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటుగా, సంబంధిత అధికారులు.. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయాలని ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. మహబూబ్ నగర్ టౌన్ పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ చేసిన కోర్టు ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు వెంటనే ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మంత్రిపై కేసు నమోదు చేశారా? లేదా? అని అడిగింది. ఒకవేళ కేసు పెట్టి ఉంటే ఎఫ్‌ఐఆర్ తో పాటుగా పూర్తి వివరాలు నేడు (ఆగస్టు 11) సాయంత్రంలోపు కోర్టు ముందు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ), పోలీసులను ఆదేశించింది. మహబూబ్ నగర్ పోలీసులు కనుక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే.. దాన్ని కోర్టు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది.
జూలై 31న హైకోర్టు తీర్పు
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి శ్రీనివాస్ గౌడ్‌పైన కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను జూలై 31న ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా రాఘవేందర్ రాజు అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, తన అఫిడవిట్ ను ట్యాంపరింగ్ చేశారని రాఘవేందర్ రాజు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలోనే మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. మంత్రితోపాటు నలుగురు ఐఏఎస్ అధికారులపైన కూడా కేసులు నమోదు చేయాలని తెలిపింది. వీరిలో ఎన్నికల కమిషన్ కు సంబంధించి రాష్ట్ర, కేంద్ర అధికారులు కూడా ఉన్నారు.
అయితే, రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టి వేయాలని కోరుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో హైకోర్టును, ఏకంగా సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, నాంపల్లి కోర్టులో ఉన్న ఆ కేసు పూర్వాపరాలు తెలియకుండా, పిటిషన్ ను పరిశీలించకుండా తాము ఏ నిర్ణయమూ తీసుకోలేమని గతంలొ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Telangana Congress CM Candidate LIVE: తెలంగాణ సీఎంపై కొలిక్కిరాని చర్చలు, రేవంత్ ను ఒప్పుకోని సీనియర్లు! ఢిల్లీకి డీకే శివకుమార్
TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
మిగ్ జాం ఎఫెక్ట్ - తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Telangana Assembly Dissolved: తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్, ఉత్తర్వులు జారీ - కొత్త అసెంబ్లీకి గెజిట్ నోటిఫికేషన్
BRS MLA Kaushik Reddy: గెలిచిన ఆనందంలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి షాక్, మరో కేసు నమోదు
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
/body>