Bengaluru Living Cost: ఇలా బతికితే ఐదేంటి పది లక్షలూ సరిపోవు - జీవన వ్యయంపై బెంగళూరు టెకీల ఓవరాక్షన్ !
Bengaluru : బెంగళూరులో జీవన వ్యయం చాలా ఎక్కువని..నాలుగైదు లక్షలు అయినా సరిపోవని ఇటీవల కొంత మంది సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ వారి ఖర్చులు చూస్తే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Bengaluru IT professional Living Cost: మన దేశంలో అంబానీలు బతుకుతున్నారు.. నిరుపేదలు బతుకుతున్నారు. ఎవరి జీవన విధానం.. ఆదాయం.. ఖర్చులు వారివి. రోజుకు నాలుగు, ఐదు వందలు సంపాదించుకునే వారూ బతుకుతున్నారు. అయితే ఫలనా చోట్ల లక్షలు సంపాదించినా బతకడం కష్టంగా ఉందని సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని కొంత మంది తెగ బాధపడిపోతున్నారు. బెంగళూరులో నివసించే ఐటీ ఉద్యోగుల్లో కొంత మంది ఇలాంటి ఓవరాక్షన్ ఎక్కువగా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పీలే రాజా అనే వ్యక్తి నెలకు ఐదు లక్షల 70వేలు సంపాదించినా సరిపోవడం లేదని.. లెక్కలు పోస్టు చేశారు. అందులో ఉన్న వివరాలు చూసి నెటిజన్లకు పిచ్చెక్కిపోయింది.
Is 5 lakhs per month salary (60 lakhs per annum CTC) enough to survive in Bangalore? Let us do the math:
— peeleraja (@peeleraja) April 17, 2025
Income tax: 2 lakhs
Home loan: 1 lakh
Food: 10k
Microbrewery: 30k
Cult fit: 20k
Goa trip: 40k
Zara drip: 20k
OTT subscriptions: 10k
Uber/Ola/Rapido: 10k
Finance with Sharan…
పీలే రాజా అనే ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే.. ఐదు లక్షలు కాదు.. పది లక్షలు సంపాదించినా సరిపోవని.. దానికి బెంగళూరు జీవన వ్యయానికి సంబంధం ఏమిటని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి ఖర్చులు పెట్టుకుని.. జీతం సరిపోవడం లేదంటే ఎలా అని మండిపడుతున్నారు.
30k microbrewery? cultfit costs 20k per month? what 10k OTT ..i can go on...you can "survive" 20k per month in Bangalore, live decently with 40k per month, save and live with trips with 70k ...more than is not Surviving
— Prinjal Boruah (@Prinjal_boruah) April 18, 2025
i don't even know if this post is meant to be sarcastic
అటెన్షన్ కోసం సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
The maximum income tax under the new tax regime for a CTC of ₹60 lakhs is ₹16,90,259.
— Robby (@robbymeranam) April 18, 2025
That makes it 1.4 lakhs a month. Now you can assume how much he is lying. 🤥
This considers zero dedications.
ఇటీవలి కాలంలో కొంత మంది బెంగళూరు టెకీలు ఇలాగే లక్షలు సంపాదిస్తున్నా సరిపోవడం లేదని పోస్టులు పెడుతున్నారు. అయితే లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకుని...జీతం సరిపోవడం లేదంటే ఎలాఅని.. వస్తున్న ఆదాయాన్ని.. సేవింగ్స్ చూసుకుని దానికి తగ్గట్లుగా జీవిస్తే.. జీతం సరిపోతుందని .. ఇలాంటి పోస్టులు పెట్టి బెంగళూరుల జీవన వ్యయం ఎక్కువ అని ప్రచారం చేయడం ఏమిటన్న ప్రశ్నలు వేస్తున్నారు.





















