అన్వేషించండి

Ganesh Chaturthi 2024: కమల్ హాసన్ సినిమాలో ఖైరతాబాద్ వినాయకుడు- ఒక్క అడుగుతో మొదలై గణేష్‌ గురించి తెలుసా?

Khairatabad Ganesh:ఖైరతాబాద్ వినాయకుడు ఏడాదికేడాది ప్రత్యేకతతో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఒక్క అడుగుతో మొదలైన ఇక్కడి వినాయక విగ్రహం నేడు 70 అడుగులకు చేరింది.

Hyderabad Ganesh Festival: గణేష్‌ చతుర్థి అంటే ఠక్కున ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. ఈసారి ఎలాంటి విగ్రహం పెడుతున్నారు. ఎత్తు ఎంత ఉంటుంది... అని చాలా మంది ఆరా తీస్తుంటారు. ఈసారి కూడా ప్రజల అంచనాలకు అందనంత స్థాయిలో ఖైరతాబాద్‌లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వినాయక పూజా కార్యక్రమాలు ప్రారంభమై 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొదట ఎప్పుడు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. అనేది పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విశేషాలు తెలుస్తున్నాయి. 

ఒక్క అడుగుతో మొదలై...

ప్రజల్లో స్వతంత్ర్య కాంక్షను రగిల్చేందుకు ఉద్యమకారులను సంఘటితం చేసేందుకు తొలిసారిగా ఈ గణేష్ విగ్రహాల ఏర్పాటు సంస్కృతిని తీసుకొచ్చారు బాలగంగాధర్ తిలక్‌. దీంతో వాడవాడలో విగ్రహాలు ఏర్పాటు అయ్యాయి. అలా ఖైరతాబాద్‌లో కూడా గణేషుడు పూజలు అందుకున్నాడు. తొలిసారి ఒక్క అడుగు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ పూజా కమిటీ సభ్యులు. అప్పుడు మొదలైనప్పటికీ 1978 నుంచి నిరంతరంగా ఈ విగ్రహం ఏర్పాటు కొనసాగుతోంది. తొలి విగ్రహాన్ని సింగరి శంకరయ్య అనే కళాకారుడు తీర్చిదిద్దాడు. తర్వాత ఆ వంశస్తులు ఈ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తున్నారు. 

Also Read: 70 ఏళ్ల మహాగణపతికి 70 అడుగుల విగ్రహం- ఖైరతాబాద్ గణేషుడి విశేషాలు తెలుసా?

కమల్ హాసన్ సినిమాలో.

1954లో నుంచి తొలిసారిగా ఇలా బహిరంగంగా పెద్ద మండపాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజలు చేస్తున్నారు. 1980లో విగ్రహాన్ని సారథి స్టూడియోలో రూపొందించారు. అక్కడ అప్పటికే కమల్‌హాసన్ నటిస్తున్న సాగర సంగమం షూటింగ్ నడుస్తోంది. అందులో ఓ పాట చిత్రీకరణ కూడా ఈ విగ్రహం ఎదుటే చేశారు. 

విగ్రహం అంటే వాళ్లే..

సింగరి వంశస్తులు మాత్రం మధ్యలో ఓ పదేళ్లు విగ్రహాల తయారీకి దూరంగా ఉన్నారు. మళ్లీ 2000 నుంచి గణేష్ ప్రతిమను తయారూ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొలువుదీరిన 70 అడుగుల మహాగణపతి విగ్రహం కూడా సింగరి వంశస్తులు తీర్చిదిద్దిందే. 

2022లో ఖైరతాబాద్‌లో తొలిసారిగా మట్టితో వినాయక విగ్రహాన్ని రూపొందించారు. 50 అడుగుల ఎత్తులో  మట్టితో శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని ప్రతిష్టించి పూజలు చేశారు. ఎడ‌మ‌వైపున శ్రీ తిశ‌క్తి మ‌హా గాయ‌త్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి విగ్ర‌హాలు ఉంచారు. 

Also Read: సింగపూర్ లో సంపెగ, నేపాల్ లో తంత్ర, శ్రీలంకలో పిళ్లయార్..విదేశాల్లో మన గణపయ్య!

ఈ స్థాయి భారీ విగ్రహాలు తయారు చేయించి ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం అంత ఈజీకాదు. కానీ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని మాత్రం ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుంటారు. ఇప్పుడు పూజలు అందుకుంటున్న 70 అడుగుల విగ్రహాన్ని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు అందిస్తామని చెబుతున్నారు పూజా కమిటీ. ఇలా ఈ స్థాయిలో భారీ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం ప్రపంచ చరిత్రలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇప్పటికే చాలా రికార్డులను ఖైరతాబాద్‌ వినాయకుడు సొంత చేసుకున్నాడని ఇప్పుడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకోబోతున్నాడని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Patnam Narender Reddy: లగచర్ల దాడి ఘటనలో ట్విస్ట్, ఏ1గా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
వాట్సాప్‌లో భారీ మార్పు చేయనున్న మెటా - గ్యాలరీ ఎంతలా మారిపోనుందంటే?
Tata Curvv: టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
టాటా కర్వ్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - భారీగా పెరిగిన వెయిటింగ్ పీరియడ్!
Pushpa 2: 'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
'పుష్ప 2' ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన శ్రీవల్లి - డబ్బింగ్ స్టూడియోలో నేషనల్ క్రష్ రష్మిక
The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Vizag Crime News: విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
విశాఖలో పట్టపగలే దారుణం, ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నం! ట్విస్ట్ ఏంటంటే
Patnam Narendar Reddy: లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
లగచర్ల దాడి కేసు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్
Embed widget