వినాయకుడి రూపానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది ఏనుగుతల విజ్ఞానం, వివేకం, విశాల దృక్పథాలను సూచిస్తుంది. సున్నితంగా ఉన్నప్పటికీ సమస్యా సమయాల్లో దృఢంగా వ్యవహరించాలని తొండం తెలుపుతుంది. వినాయకుడి చిన్న కళ్లు సునిశిత దృష్టికి సంకేతం. జీవితంలో అన్ని కోణాల సునిశిత పరిశీలన ప్రాధాన్యతను తెలుపుతాయి. చురుకైన మూషిక వాహనం మనలోని విచక్షణా రహితమైన కోరికలను అదుపు చేయ్యాలనే సందేశాన్నిస్తుంది. పెద్ద పొట్ట జీవితంలో ఎదురయ్యే అన్నీ సమానంగా స్వీకరించాలని తెలుపుతుంది. పెద్ద చెవులు ఎక్కువ విన్నా కూడా తక్కువ మాట్లాడమని చెప్పేందుకు సంకేతం. వినాయకుడి రూపం ఆధ్యాత్మిక, జీవనపాఠాలు, విభిన్న జీవన మార్గాలను ఒకేసారి తెలియజేసే మార్గం.