ఇంట్లో పావురం గూడు కడితే...? మన పరిసరాల్లో పావురం గూడు కట్టుకుంటే మంచిదేనా అనే విషయంపై చాలా అభిప్రాయాలు ప్రాచూర్యంలో ఉన్నాయి. కొన్ని సంస్కృతులలో పావురం పరిసరాల్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదని నమ్మకం ఉంది. ఎలాంటి నెగెటివిటి లేదని, కేవలం గుడ్ ఎనర్జీ మాత్రమే ఉందనేందుకు సంకేతంగా భావిస్తారు. పావురాలు, వాటి గూళ్లు పరిసరాల్లో ఉన్నాయంటే అది చాలా సురక్షితమైన స్థలంగా భావించాలట. పావురాలు అదృష్టాన్ని తెచ్చే పక్షులని, రక్షణ కల్పిస్తాయని నమ్మకం. పైన చెప్పుకున్నవి విశ్వాసాలు, నమ్మకాలు మాత్రమే. సైన్స్ పావురాల గురించి కొన్ని విషయాలను చెబుతోంది. పావురాలు చాలా రకాల అలెర్జీలకు కారణం కావచ్చు. అనారోగ్యాలకు కారణం అవుతాయి కనుక వీటిని దురదృష్టానికి సంకేతాలుగా భావించవచ్చు. నిరంతరం వాటి శబ్ధాలతో చాలా డిస్టర్బెన్స్ గా కూడా ఉంటుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే