ఈ ఏడాది దసరా నవరాత్రుల తేదీలివే
ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ శరన్నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి
2024 లో దసరా ఉత్సవాలు అక్టోబరు 03 న ప్రారంభమై అక్టోబరు 12న ముగుస్తాయి
రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది
ఆయా ఆలయాల్లో అనుసరించే పద్ధతి ఆధారంగా అమ్మవారి అలంకారాల్లో మార్పులుంటాయి...
మూలా నక్షత్రం నుంచి వరుసగా నాలుగు రోజులు అన్ని ఆలయాల్లోనూ ఒకే విధమైన అలంకారాలుంటాయి
మూలా నక్షత్రం రోజు దుర్గమ్మ చదువుల తల్లి సరస్వతిగా దర్శనమిస్తుంది
దుర్గాష్టమి రోజు దుర్గతులు తొలగించే దుర్గమ్మగా అనుగ్రహిస్తుంది
మహర్నవమి రోజు శత్రువులను సంహరించే మహిషాసురమర్దినిగా సింహవాసనంపై దర్శనమిస్తుంది దుర్గమ్మ
శరన్నవరాత్రుల్లో ఆఖరిరోజైన దసరా రోజు రాజరాజేశ్వరి దేవిగా ప్రశాంతవదనంతో భక్తులపై కరుణ ప్రసరిస్తుంది