పసుపు గణపతిని ఎందుకు తయారు చేయాలి!
ఏ శుభకార్యం చేసినా ముందుగా పసుపు గణపతిని తయారు చేస్తారు
పూజ ప్రారంభించేముందు బొట్టుపెట్టి..ముందుగా పసుపు వినాయకుడిని పూజిస్తారు
పసుపు గణపతి బదులు కొందరు పటానికి, విగ్రహానికి పూజ చేస్తుంటారు
పసుపుతో వినాయకుడిని చేస్తేనే పూజ ఫలిస్తుందా.. విగ్రహాలకు చేయకూడదా అనే సందేహం ఉంది
సాధారణంగా భగవంతుడు అంటే ఓ రూపం అని ఫిక్సైపోతారంతా...అయితే...
రూపం ఉన్న విగ్రహం నుంచి.. రూపంలేని పదార్థాల్లోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పడమే దీనివెనుకున్న ఆంతర్యం
అందుకే...శుభ సూచకంగా భావించే పసుపుతో గణపతిని తయారు చేసి పూజిస్తారు...
అదే పసుపు ముద్దతో గౌరీ దేవిని తయారు చేసి పూజ చేస్తారు
భగవంతుడిపై ధ్యాస మనసులో ఉండాలని కానీ పూజించే విగ్రహంలో కాదని అర్థం..