తిరుమ‌ల ఆల‌యం గురించి కొన్ని ఆశ్చర్యప‌రిచే నిజాలు మీకోసం..

Published by: Venkatesh Kandepu

గర్భ గుడిలో శ్రీవారి పూజ‌కు వాడే పూలు, పాలు లాంటి వ‌స్తువులు తిరుపతికి దాదాపు 22 కి.మీ. దూరంలో ఉన్న ఒక ర‌హ‌స్య గ్రామం నుంచి సేక‌రిస్తారు.

శ్రీవారి విగ్రహం ఆల‌యంలోని గ‌ర్భగుడిలో మ‌ధ్యలో ఉన్నట్టు క‌నిపిస్తుంది. కానీ నిజానికి గర్భగుడిలో కుడివైపున ఒక మూల‌న ఉంటుంది.

శ్రీవారి విగ్రహం వెనుక వైపు నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుంటుంది. శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప ఇతరులకు అది వినే యోగం లేదు.

గ‌ర్భగుడిలో శ్రీవారి ముందు వెలిగించే దీపాలు కొన్ని వేల సంవ‌త్సరాలుగా కొండెక్కకుండానే వెలుగుతున్నాయి.

శ్రీవారి విగ్రహం నిత్యం తేమతో ఉంటుంది. పూజారులు విగ్రహాన్ని ఎన్నిసార్లు తుడిచినా పొడిగా మార‌డం లేదు.

నిత్యం వేంకటేశ్వరుడికి వాడిన పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (శ్రీ కాళహస్తికి వెళ్లే దారి) లో కనిపిస్తాయి.

విగ్ర‌హానికి వేల ఏళ్లుగా పచ్చ కర్పూరం రాస్తూ పూజ‌లు చేస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరక పోవడం ఆశ్చర్యం క‌లిగిస్తోంది.

శ్రీవారి విగ్ర‌హం 110 డిగ్రీల ఫారిన్ హీట్‌తో వేడిగా ఉంటుంది. ఆభ‌ర‌ణాలు తీసే సంద‌ర్భంలో పూజారులు ఆ వేడిని అనుభూతి చెందుతారు.