వినాయక చవితి 2024: గణపతి పూజలో వినియోగించే 21 రకాల ఆకులు ఇవే!
వినాయకుని పూజించే 21 రకాల ఆకులు వినియోగిస్తారు కదా..వాటినే ఏకవింశతి పత్రాలు అంటారు..
ఆధ్యాత్మికపరంగా మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఈ 21 పత్రాలు రక్ష
1. మాచీపత్రం , 2. బృహతీపత్రం (వాకుడు), 3. బిల్వపత్రం (మారేడు)
4. దూర్వాయుగ్మం (గరికె) 5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త) 6. బదరీపత్రం (రేగు)
7. అపామార్గపత్రం (ఉత్తరేణి), 8. వటపత్రం (మఱ్ఱి), 9. చూతపత్రం (మామిడి)
10. కరవీరపత్రం (గన్నేరు), 11. విష్ణుక్రాంతపత్రం , 12. దాడిమీపత్రం (దానిమ్మ)
13. దేవదారుపత్రం , 14. మరువకపత్రం (మరువం), 15. సింధువారపత్రం (వావిలి)
16. జాజీపత్రం (సన్నజాజి), 17. గండకీపత్రం, 18. శమీపత్రం (జమ్మి)
19. అశ్వత్థపత్రం (రావి) , 20. అర్జునపత్రం (మద్ది) , 21. అర్కపత్రం (తెల్ల జిల్లేడు)