మహాభారతాన్ని లిఖించింది వినాయకుడే!
మహాభారత రచన చేయాలనుకున్న వ్యాసమహర్షి దానికెలా రూపమివ్వాలో అర్థంకాక..బ్రహ్మను ప్రార్థించాడు
ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు..వినాయకుడు మాత్రమే నీ మార్గం చూపగలడని చెప్పాడు
అప్పుడు వ్యాసమహర్షి అడగడంతో సరేనన్న గణనాథుడు...మహాభారతం లిఖించేందుకు అంగీకరించాడు
అయితే తన రచన మొదలయ్యాక ఆగదని..నిరంతరం చెబితేనే రాస్తానని అలా ఆగకుండా చెప్పాలని కోరాడు
వ్యాసుడు కూడా తను చెప్పిన శ్లోకాలను పూర్తిగా అర్థం చేసుకునే లిఖించాలనే నిబంధన పెట్టాడు
వినాయకుని లేఖనా వేగాన్ని అందుకోవడం ఒక్కోసారి వ్యాసుడికి కష్టంగా మారితే..
వ్యాసమహర్షి చెబుతున్న వేగంతో లిఖించడం గణపతికి కష్టమయ్యేది
మహాభారతం లిఖిస్తున్న మధ్యలో ఘంటం విరిగిపోతే...తన దంతాన్నే ఘంటంగా మార్చి రాశాడు గణనాథుడు
అలా వ్యాసమహర్షి చెబుతుంటే వినాయకుడు లిఖిస్తే మహాభారతం గ్రంధస్థం అయింది..