ఏ రాశివారు ఏ గణపతిని పూజించాలి!
మేష రాశి
ఎరుపు రంగు గణపతిని ఎర్రటి వస్త్రాలతో అలంకరించాలి. బెల్లం , లడ్డూ నైవేద్యం సమర్పించాలి.
వృషభ రాశి
నీలి రంగు గణపతిని తెల్లటి వస్త్రాలతో అలంకరించాలి. కొబ్బరిలడ్డూ, మోదకం నివేదించాలి
మిథున రాశి
ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడిని పూజించాలి - లడ్డూ, పండ్లు నైవేద్యం పెట్టాలి
కర్కాటక రాశి
తెల్లటి గణపయ్యను గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి. పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి
సింహ రాశి
ఎరుపు రంగు వినాయకుడిని తీసుకొచ్చి..ఎర్రటి వస్త్రంపై పెట్టి పూజ చేయాలి. బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని ప్రసాదంగా పెట్టాలి
కన్యా రాశి
ఆకుపచ్చరంగు వినాయక విగ్రహం తీసుకొచ్చి అదే రంగు వస్త్రంతో అలంకరించాలి. పండ్లు, లడ్డూలను నైవైద్యం సమర్పించాలి
తులా రాశి
తెలుగు రంగు లేదా నీలం రంగు గణేషుడిని తీసుకొచ్చి తెల్లటి వస్త్రాలతో అలంకరించి పూజించాలి. అరటిపండ్లు, స్వీట్స్ నైవేద్యం పెట్టాలి
వృశ్చిక రాశి
ఎరుపు రంగులో ఉన్న వినాయకుడిని అదే రంగు వస్త్రాలతో అలంకరించి పూజ చేయాలి. బెల్లం, లడ్డూ, మోదకం నైవేద్యంగా సమర్పించాలి
ధనుస్సు రాశి
పసుపు రంగు గణేషుడుని పసుపు వస్త్రంతో అలంకరించి లేదంటే పసుపు రంగు వస్త్రంపై ఉంచి పూజించాలి. లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి.
మకర రాశి
నీలిరంగులో ఉండే లంబోదరుడి విగ్రహం తీసుకొచ్చి అదే రంగు వస్త్రంతో అలంకరించి భక్తితో పూజించి.. నువ్వుల లడ్డూని నైవేద్యంగా సమర్పించాలి
కుంభ రాశి
నీలిరంగు గణేషుడిని తీసుకొచ్చి అదేరంగు వస్త్రంతో అలంకరించి తెల్లటి పూలతో పూజించాలి. డ్రై ఫ్రూట్స్ తో చేసిన స్వీట్స్ నివేదించాలి
మీన రాశి
పసురు రంగు వినాయకడుని మీరు పూజించాలి. పసుపు రంగు వస్త్రంపై గణనాథుడిని ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించి.. పసుపు రంగులో ఉండే స్వీట్లనే నైవేద్యంగా సమర్పించాలి